Mani Ratnam | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న లెజెండరీ ఫిల్మ్ మేకర్స్‌లో ఒకరు మణిరత్నం (Mani Ratnam). ఈ దర్శకుడి నుంచి సినిమా వస్తుందంటే హీరోహీరోయిన్లు, కథ, నేపథ్యం ఏంటని తెలుసుకునే పనిలో బిజీగా ఉంటారు మూవీ లవర్స్. సినిమా హిస్టరీలో ఐకానిక్ లవ్ స్టోరీలతోపాటు క్లాసిక్ సినిమాలను అందించారు. పొన్నియన్ సెల్వన్‌ను రెండుపార్టులుగా తెరకెక్కించి తమిళంలో మంచి హిట్టందుకున్నారు.
చివరగా కమల్ హాసన్ లీడ్ రోల్లో థగ్ లైఫ్‌ను తెరకెక్కించగా ఊహించని విధంగా బోల్తా కొట్టింది. ఇక ఈ క్రేజీ డైరెక్టర్ ఇప్పుడు రొమాంటిక్ డ్రామాను ప్లాన్ చేస్తున్నాడు. ముందుగా అనుకున్న ప్రకారం ఈ ఏడాదే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల వర్కవుట్ కాలేదు. తాజా టాక్ ప్రకారం ఈ మూవీ కాప్ లవ్ స్టోరీ అట. కథానుగుణంగా సరిపడే హీరోహీరోయిన్ల కోసం ఆరు నెలలుగా వేట కొనసాగిస్తున్నాడట మణిరత్నం. నెట్టింట కొందరు యాక్టర్ల పేర్లు రౌండప్ చేస్తుండగా ఇప్పటివరకు సరైన లీడ్ యాక్టర్లు ఫైనల్ కాలేదని ఇన్సైడ్ టాక్.
ముందుగా విక్రమ్ కుమారుడు ధ్రువ్, రుక్మిణి వసంత్ పేర్లను అనుకోగా.. ధ్రువ్ ఇటీవలే Bison సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు. మరోవైపు కాంతార చాప్టర్ 1తో జోష్ మీదున్న రుక్మిణి వసంత్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో లీడ్ యాక్టర్లుగా తీసుకునేందుకు వర్కవుట్ కాలేదట.
తాజాగా ఈ కాప్ డ్రామా లవ్ స్టోరీలో విజయ్ సేతుపతి, సాయిపల్లవి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే విజయ్ సేతుపతి, సాయి పల్లవి కాంబోలో రాబోయే తొలి సినిమా ఇదే కానుంది. మరోవైపు నాని పేరు కూడా తెరపైకి వచ్చింది. మరి మేకర్స్ నుంచి ఎవరి పేర్లు అధికారికంగా బయటకు వస్తాయనేది చూడాలి.
Rajamouli | ‘అవతార్ 3’ ప్రమోషన్స్- రాజమౌళితో జేమ్స్ కామెరాన్ స్పెషల్ ఇంటర్వ్యూ.. వీడియో వైరల్
Kaantha | కాంత చిత్రానికి థియేటర్లలో ఫ్లాప్ టాక్.. కానీ ఓటీటీలో ఇంప్రెసివ్ రెస్పాన్స్
Tamannaah | క్రేజీ లైనప్.. మరో బాలీవుడ్ ప్రాజెక్టులో తమన్నా