పడవ పందేల నేపథ్యంలో రూపొందించిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘మండాడి’. సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మతిమారన్ పుగళేంది దర్శకుడు. మహిమా నంబియార్ కథానాయికగా నటించింది. పాన్ ఇండియా స్థాయిలో నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఉభయ తెలుగు రాష్ర్టాల్లో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్నది. ఈ చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.
యూ.ఏ.సర్టిఫికెట్ లభించింది. ఈ సినిమాలోని బోట్ ఫైట్ సీక్వెన్స్ అద్భుతమని సెన్సార్‌వారు ప్రశంసించారని, యాక్షన్ ఘట్టాలు ఈ సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్ తెలిపారు. మత్స్యకారుల జీవితం, సంప్రదాయ పడవ పందేలు, ఆధిపత్య పోరాటం నేపథ్యంలో హై ఇంటెన్సిటీ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, నిర్మాత: ఎల్రెడ్ కుమార్.