పారదర్శకంగా విచారణ జరగాలి.. బండి భగీరథ్ పోక్సో కేసుపై హీరో మంచు మనోజ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా ఈ కేసుపై హీరో మంచు మనోజ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. బండి సంజయ్ కొడుకు భగీరథ్ వ్యవహారం తనను ఎంతగానో కలచివేసిందన్నారు. మైనర్ బాలికల రక్షణ కోసం ఏర్పాటు చేసిన పోక్సో యాక్ట్ సక్రమంగా అమలు కావాలని.. అధికారం, పలుకుబడి, రాజకీయ ఒత్తిళ్లతో ఈ కేసు పక్కదారి పట్టకుండా చూడాలని కోరారు.
మైనర్ బాలికలకు సంబంధించిన కేసుల్లో పారదర్శకత, జవాబుదారీతనం అవసరమని.. ఇలాంటి కేసుల్లో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుందన్నారు. ఇది రాజకీయాలు, వ్యక్తులకు సంబంధించిన విషయం కాదని, వాస్తవాలను వెలికితీసి, న్యాయాన్ని గెలిపించాలని మంచు మనోజ్ విజ్ఞప్తి చేశారు.
ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా విచారణ పారదర్శకంగా జరుగుతుందనే నమ్మకం ఉందని, ఎంతటి వారైనా చట్టానికి అతీతులు కారనే విషయం నిరూపించబడాలని ఆయన అన్నారు. బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంలో తెలుగు సినీరంగం నుంచి ఇప్పటివరకు ఎవరూ స్పందించలేదు. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ పోస్ట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెట్టుబడిదారులకు రక్షణ కరువు.. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనువైన పరిస్థితులు లేవు
మోదీజీ.. ఎంతమంది పోలీసులనైనా తెచ్చుకోండి.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

