Manchu Manoj | మంచు వారి ఇంట పెండ్లి సందడి మొదలైంది. మంచు మనోజ్ (Manchu Manoj) రెండో పెండ్లికి రెడీ అయ్యాడు. అందరూ అనుకున్నట్లుగానే భూమా మౌనిక రెడ్డి(Bhuma Mounika reddy)ని మనోజ్ మరికొన్ని గంటల్లో వివాహమాడబోతున్నాడు. ఇరు కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధువుల సమక్షంలో మార్చి3వ తేదీ (శుక్రవారం) ఈ జంట వివాహబంధంతో ఒక్కటికాబోతోంది.
వివాహ వేడుకలో భాగంగా భూమా మౌనిక రెడ్డి ఫొటోను మొదటి సారి మంచు మనోజ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘మనోజ్ మంచు పెండ్లి కూతురు భూమా మౌనిక (లవ్ సింబల్). మనోజ్ వెడ్స్ మౌనిక’ అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పిక్ తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
వీరి వివాహం ఈరోజు రాత్రి 8:30 గంటలకు మంచు లక్ష్మి ఇంట్లో జరగబోతున్నట్లు తెలుస్తోంది. వీరి వివాహానికి ఇరు కుటుంబ సభ్యులతోపాటు, అతి కొద్ది మంది సన్నిహితులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకాబోతున్నట్లు సమాచారం.
మంచు మనోజ్ (Manchu Manoj) 2015లో ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరి మధ్య నెలకొన్న విబేధాల కారణంగా వీరు 2019లో విడాకులు తీసుకుని ఎవరిదారి వారు చూసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న మనోజ్.. త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో (Tollywood Industry) ఇటీవలే తెగ ప్రచారం జరిగింది. భూమా మౌనిక రెడ్డి (Bhuma Mounika Reddy) తో మనోజ్ ఏడడుగులు వేయబోతున్నాడంటూ వార్తలు పుట్టుకొచ్చాయి.
మౌనికకు కూడా ఇది రెండో పెండ్లే. 2016లో మౌనికా రెడ్డికి చిత్తూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త గణేష్ రెడ్డితో వివాహం అయ్యింది. 2018లో మౌనికారెడ్డి-గణేష్ దంపతులకు ఓ కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత రెండేండ్లకు మౌనికా రెడ్డి తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే ఉంటోంది. ఈ నేపథ్యంలోనే మనోజ్-మౌనికలు పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టుగానే వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు.
Pellikuthuru @BhumaMounika ❤️#MWedsM #ManojWedsMounika 🙏🏼❤️ pic.twitter.com/eU6Py02jWt
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 3, 2023
Also Read..
Ranbir Kapoor | యాక్టర్లు ఆకలితో అలమటిస్తున్నారు.. రణ్ బీర్ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Viral News | వింత సంప్రదాయం.. బురదలో గేదెల్లా పొర్లుతూ వరుడికి ఆహ్వానం
IND vs AUS | బోణీ కొట్టిన ఆసీస్.. టీమిండియాపై 9 వికెట్ల తేడాతో విజయం