Manchu Manoj | టాలీవుడ్ యాక్టర్లలో ఓ వైపు సినిమాలతో వినోదం అందిస్తూనే.. మరోవైపు సామాజిక సేవలో తనవంతు బాధ్యతగా ముందుండే వారిలో టాప్లో ఉంటాడు మంచు మనోజ్. ఈ టాలెంటెడ్ యాక్టర్ సామాజిక సేవలో భాగంగా సరికొత్త ముందడుగు వేసి ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నాడు. మంచు మనోజ్, అతని సతీమణి భూమా మౌనిక రెడ్డి ఐక్య ధైర్య సేన సమితి పేరిట కొత్త ట్రస్ట్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తొలి అడుగుగా ఐదుగురు పిల్లలను దత్తత తీసుకొని, వారిని చదివిస్తానని చెప్పాడు మంచు మనోజ్.
ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ.. ఎప్పటి నుంచో మేం సేవా కార్యక్రమాలంటే ముందుంటాం.. 10 మందికి ఎప్పుడు ఏ అవసరమున్నా ముందుంటాం.. నేను కానీ నా సతీమణి మౌనిక కానీ మా చిన్నప్పటి నుంచి మా పెద్దల నుంచి 10 మంది కోసం నిలబడటం బలంగా నేర్చుకున్నం. ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలు చేశాం. కానీ అదంతా ఒక ఆర్గనైజేషన్ కింద ఒక ట్రస్ట్కింద ఫాం చేసి మా ఐడియాలజీ పది మందికి సేవ చేయాలని ముందుకొచ్చే వారికి ఒక మంచి ప్లాట్ఫాం కావాలని ఈ రోజు ఐక్య ధైర్య సేనే సమితి మొదలుపెట్టడం జరిగిందన్నాడు.
ఇది మౌనికా ఐడియా. ఎప్పుడూ దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి యూనిటీగా ప్లాన్ చేద్దామని దీన్ని ముందుకు తీసుకొస్తున్నాం. ఈ రోజు బ్లడ్ డొనేషన్, అలాగే మేం ఐదుగురు పిల్లలను దత్తత తీసుకొని వాళ్లను చదివిద్దాం అనుకుంటున్నాం. అది ఇక్కడితో ఆగదు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ప్రతీ జిల్లాలో, ప్రతీ టౌన్, ఊరిలో, ఏరియాలో ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాం. మాకు జీవితంలో ఏదైనా గెలుపు ఉందంటే ఈ ఆర్గనైజేషన్, ఈ ట్రస్ట్ ఎన్నో లక్షలమందికి, కోట్ల మందికి ఉపయోగపడిన రోజు జీవితంలో మేంసక్సెస్ అయినట్టు.. అప్పటివరకు కాదన్నాడు మంచు మనోజ్.
ఐక్య ధైర్య సేన సమితి పేరిట కొత్త ట్రస్ట్ ప్రారంభించిన సినీ నటుడు మంచు మనోజ్, అతని సతీమణి భూమా మౌనిక రెడ్డి
ఈ నేపథ్యంలో తొలి అడుగుగా ఐదు మంది పిల్లలను దత్తత తీసుకొని, వారిని చదివిస్తానని చెప్పిన మంచు మనోజ్ pic.twitter.com/BGzQuKbrbr
— Telugu Scribe (@TeluguScribe) May 17, 2026