సోషల్మీడియాలో టాలీవుడ్ (Tollywood) నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi) చురుకుగా ఉంటుందని తెలిసిందే. మంచు వారమ్మాయి తాజాగా బాల్ గౌన్ డ్రెస్ లో మెరిసిపోతున్న ఫొటోలను ఇన్ స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా..నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇటీవల జరిగిన ఓ అవార్డు ఫంక్షన్ లో ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా రూపొందించిన బాల్ గౌన్ డ్రెస్లో తళుక్కున మెరిసిపోయింది. ఇంతకీ మంచు వారమ్మాయి వేసుకున్న డ్రెస్ ఖరీదెంతో తెలుసా..? రూ.లక్షా 95వేలు. ఖరీదైన కాస్ట్యూమ్స్ లో డిఫరెంట్ స్టైల్లో కెమెరాకు ఫోజులిచ్చింది.
ఆమె అసాధ్యమైన కలలు కనేది..ఆమె మనస్సును అనుసరించింది, సొంతంగా అద్భుత కథను సృష్టించింది..అంటూ స్పూర్తిని కలిగించే క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఏడాది నెట్ఫ్లిక్స్ అంథాలజీ పిట్టకథలు చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది మంచు లక్ష్మి. ఈ చిత్రంలో స్వరూపక్క పాత్రలో నటించింది. నాగ్ అశ్విన్, బీవీ నందినీ రెడ్డి, తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఇది కూడా చూడండి
Akhil Akkineni | గత పదేళ్ల నుంచి తనకిష్టమైన ఫొటో చూపించిన అఖిల్
Jacqueline Fernandez | ‘నీలిరంగు చీరలోనా..సందమామా నీవే జాణ’
Sunny Leone | స్వర్గంలో ఏంజెల్లా సన్నీలియోన్