మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty)ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. టాలీవుడ్ యువ హీరో అఖిల్ అక్కినేని నటిస్తోన్న ఏజెంట్ (Agent) చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు మమ్ముట్టి. ఇదిలాఉంటే ఈ స్టార్ హీరో కొత్త చిత్రం పూజాకార్యక్రమాలతో షురూ అయింది. మమ్ముట్టి 418వ (Mammootty 418th)చిత్రంగా వస్తున్న ఈ ప్రాజెక్టును బీ ఉన్నిక్రిష్ణన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఆర్డీ ఇల్లుమినేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్ రైటర్ ఉదయ్ కృష్ణ కూడా భాగస్వామ్యం కాబోతున్నాడు.
జులై 15 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలోనే క్లారిటీ రానుంది. డిఫరెంట్ జోనర్లతో ప్రేక్షకుల ముందుకొచ్చే ఈ స్టార్ యాక్టర్ కొత్త సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. తెలుగులో స్వాతికిరణం, సూర్య పుత్రులు సినిమాల్లో నటించిన మమ్ముట్టి..రెండు దశాబ్దాల తర్వాత 2019లో వైఎస్సార్ బయోపిక్‌గా వచ్చిన యాత్ర సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించాడు. ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది.
ఏడు పదుల వయస్సు దరిచేరినా తగ్గేదేలే అంటూ వరుస పెట్టి సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోలందరికీ స్పూర్తిగా నిలుస్తున్నాడు మమ్ముట్టి. ఈ స్టార్ హీరో ఖాతాలో ప్రస్తుతం ఏడు ప్రాజెక్టులున్నాయి.
#Megastar418 ⚡#Mammootty and Unnikrishnan B combo film Pooja Happened Today #MegastarMammootty pic.twitter.com/rHIGg11Xz2
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) July 10, 2022