Mammootty | ఏడు పదుల వయస్సు దాటినా ఆ ఛాయలేమి కనిపించకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తున్నాడు మాలీవుడ్ స్టార్ యాక్టర్ మమ్ముట్టి (Mammootty). ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన ఈ స్టార్ యాక్టర్ హోం ప్రొడక్షన్లో ఏడో ప్రాజెక్ట్ వస్తోంది. జితిన్ కే జోష్ డైరెక్ట్ చేస్తున్న కొత్త సినిమా షూటింగ్ నేడు తమిళనాడులోని నాగల్ కోయిల్లో షురూ అయింది.
ఈ చిత్రంలో జైలర్ ఫేం వినాయకన్ ( Vinayakan) కీలక పాత్రలో నటిస్తున్నాడు. డైరెక్టర్ అండ్ వినాయకన్ టీం పూజా సెర్మనీ స్టిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది. మమ్ముట్టి యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నటిస్తున్న బజూక పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉంది.
Dominic and the Ladies Purse చిత్రీకరణ దశలో ఉంది. జైలర్ సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించిన వినాయగన్, మమ్ముట్టి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.
పూజా సెర్మనీ స్టిల్స్..
Commencing our 7th production by Mammootty Kampany! Directed by Jithin K Jose, with a Pooja ceremony at Nagercoil. Starring @mammukka & Vinayakan.
Stay tuned for more updates !!!#Mammootty #Vinayakan #MammoottyKampany #JithinKJose #WayfarerFilms #TruthGlobalFilms pic.twitter.com/ZI04bVqGVL
— MammoottyKampany (@MKampanyOffl) September 25, 2024
Devara Movie | ‘దేవర’ టికెట్ ధరలు.. నిర్మాతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భారీ షాక్.!
Mohan Babu | మోహన్ బాబు ఇంట్లో చోరీ.. రూ.10 లక్షలతో ఉడాయించిన పనిమనిషి
Rathnavelu | దేవరలో జాన్వీకపూర్ కనిపించేది అప్పుడేనట.. రత్నవేలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్