Malayalam Film Industry Drug Free | మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో మాదకద్రవ్యాల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై చిత్ర నిర్మాణంలో పాలుపంచుకునే ప్రతి ఒక్కరూ, డ్రైవర్ల నుండి సూపర్ స్టార్స్ వరకు, షూటింగ్ సమయంలో మాదకద్రవ్యాలను ఉపయోగించబోమని హామీ ఇస్తూ అఫిడవిట్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధన జూన్ 26 నుండి అమలులోకి రాబోతుంది. ఇదే రోజున మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం జరుపుకోబోతున్నారు.
ఇటీవల చిత్ర పరిశ్రమలో చోటుచేసుకున్న డ్రగ్స్ సంబంధిత అరెస్టులు, పలువురు నటులు, సిబ్బంది సభ్యులు పట్టుబడటంతో ఈ కఠిన చర్యలకు ఉపక్రమించినట్లు ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ వెల్లడించింది. షూటింగ్ సెట్లు, లొకేషన్లు మరియు పోస్ట్-ప్రొడక్షన్ కార్యకలాపాల్లో డ్రగ్స్ లేని వాతావరణాన్ని సృష్టించడమే తమ లక్ష్యమని అసోసియేషన్ పేర్కొంది. ఈ నిర్ణయంపై ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ మలయాళ చిత్ర పరిశ్రమలోని అన్ని విభాగాలతో విస్తృతంగా చర్చలు జరిపింది. డ్రగ్స్ లేని పరిశ్రమను కోరుకుంటూ అందరూ ఈ చర్యకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ (AMMA) కూడా ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది.
Read More