Mammootty | మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి ఫాతిమా ఇస్మాయిల్ (93) శుక్రవారం కోచిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూసింది. ఆమె గతకొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నది. ఫాతిమా ఇస్మాయిల్ మృతిపట్ల దక్షిణాదికి చెందిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
కొట్టాయం సమీపంలోని మ మ్ముట్టి స్వగ్రామం చెంపులో ఫాతిమా ఇస్మాయిల్ అంత్యక్రియల్ని నిర్వహించబోతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మలయాళ చిత్ర సీమలో అగ్ర హీరోగా వెలుగొందుతున్న మమ్ముట్టి తెలుగులో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. స్వాతికిరణం, సూర్యపుత్రులు, దళపతి, యాత్ర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు.