Malavika | యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ నటిస్తున్న తాజా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఓ భామ అయ్యో రామ చిత్రం జూలై 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో మలయాళ చిత్రం ‘జో’తో ప్రేక్షకుల మనసులు గెల్చుకున్న నటి మాళవిక మనోజ్, తొలిసారి తెలుగు తెరకు కథానాయికగా పరిచయం అవుతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కథానాయిక మాళవిక మీడియాతో ముచ్చటిస్తూ తన అనుభవాలను పంచుకుంది. “తమిళంలో నటించిన ‘జో’ చిత్రంలో నా నటనను చూసిన దర్శకుడు రామ్ ఈ సినిమాలో నటించమన్నారు. కథ విన్న వెంటనే నాకెంతో నచ్చింది,” అని మాళవిక చెప్పింది. ఈ సినిమాలో ఆమె సత్యభామ అనే పాత్రలో కనిపించబోతుంది. ఇది మోడ్రన్, హైపర్, అటిట్యూడ్ ఉన్న గర్ల్ క్యారెక్టర్ అని చెబుతోంది.
తెలుగు భాష రాకపోయినా, భావాన్ని గ్రహించి తనకు తానుగా నటించిందని మాళవిక చెప్పింది. “ఇది నా రియల్ లైఫ్‌కు పూర్తిగా భిన్నమైన పాత్ర. ఎలాంటి హోమ్‌వర్క్ చేయలేదు కానీ పాత్రలో లీనమయ్యాను అని తెలిపింది. తనకు సినీ నేపథ్యం లేకపోయినా, కుటుంబం నుండి పూర్తి సపోర్ట్ లభించిందని మాళవిక తెలిపింది. ప్రారంభంలో మా బంధువులు భయపడ్డారు కానీ ఇప్పుడు ట్రైలర్ చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటూ హర్షం వ్యక్తం చేసింది.నాకు స్విమింగ్ రాకపోయినా ఈ సినిమాలో ఓ సన్నివేశం కోసం నీళ్ళల్లోకి దూకేసాను. నాకు డూప్ చేయాల్సిన అమ్మాయి రాకపోవడంతో షూటింగ్ వాయిదా వేయడం ఇష్టం లేక భయపడుతూనే దూకేసినట్టు పేర్కొంది.
నాకు అసిస్టెంట్ డైరెక్టర్ ఎంతో సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో లవ్ సన్నివేశాల్లో ఫీల్ కొత్తగా ఉంటుంది అని తెలిపింది.’ఓ భామ అయ్యో రామ’ రొమాంటిక్ కామెడీ ప్రేమకథతో పాటు వినూత్న పాత్రలతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంటుంది. హీరో సుహాస్ వెరీ నైస్ పర్సన్ అనీ, సెట్లో సినిమాకోసం మాత్రమే మాట్లాడతారని, ఈ సినిమాలో తమ కెమిస్ట్రీ బావుంటుందని చెప్పుకొచ్చింది, ముఖ్యంగా ప్రేమ సన్నివేశాల్లో ఫీల్ కొత్తగా ఉంటుందని మాళవిక మనోజ్ పేర్కొన్నారు. వైవిధ్యమైన పాత్రలతో నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనుందని, నచ్చిన కథల్ని మాత్రమే ఎంచుకుంటానని, కంఫర్ట్ జోన్లోనే సినిమాలు చేస్తానని మాళవిక మనోజ్ స్పష్టం చేసింది.