Malavika Mohanan | సోషల్ మీడియాలో ఎప్పటికపుడు కొత్త కొత్తగా ట్రెండీ లుక్‌లో మెరిసిపోతూ అభిమానులు, ఫాలోవర్లకు నిద్రపట్టకుండా చేస్తుంది మలబారు సోయగం మాళవిక మోహనన్ (Malavika Mohanan). ఈ బ్యూటీ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ యాక్టర్ ప్రభాస్‌తో కలిసి రాజాసాబ్ సినిమాలో నటిస్తుందని తెలిసిందే. తొలిసారి తెలుగులో నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే నెలకొన్నాయి.
తాజాగా ఈ భామకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి నెట్టింటిని షేక్ చేస్తోంది. ఈ బ్యూటీ కెరీర్లో తొలిసారి ఓ సీనియర్ హీరోతో రొమాన్స్ చేసేందుకు రెడీ అయింది. మాళవిక మోహనన్ మాలీవుడ్ స్టార్ యాక్టర్ మోహన్‌లాల్ (Mohanlal) హృదయపూర్వంలో హీరోయిన్గా ఫైనల్ అయిందని ఇండస్ట్రీ సర్కిల్ సమాచారం. మాళవిక మోహనన్ ఓ సీనియర్ హీరోతో రొమాన్స్ చేయడం ఇదే తొలిసారి కావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రాన్ని సత్యన్ అంథిక్కడ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీలో సంగీత, సిద్దిఖీ, సంగీత్ ప్రతాప్, నిషాన్, లలు అలెక్స్, జనార్ధనన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 10 నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది.
Apsara Rani | సినిమాలు వదిలేయాలనుకున్నా.. రాచరికం ఈవెంట్లో అప్సర రాణి