బాలీవుడ్ యోగా భామ మలైకా అరోరా (Malaika Arora) ఇటీవలే రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. పూణేకు సమీపంలో జరిగిన కారు ప్రమాదం (car accident) లో తీవ్రగాయాలతో మలైకాకు తీవ్ర గాయాలయ్యాయి. తృటిలో పెను ప్రమాదం తప్పి ప్రాణాలతో సురక్షితంగా బయటపడింది. ఈ ప్రమాదం జరిగిన సుమారు నెల అవుతుంది. చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకున్న మలైకా అరోరా..మళ్లీ షూటింగ్లో చేరిపోయింది. ఈ సందర్భంగా ఆ ఛేదు అనుభవం గురించి చెప్పింది.
‘ఆ ఘటన గుర్తుకొచ్చినపుడు నేను ఆటోపైలట్ మోడ్లో ఉన్నాను. నేను ఒంటరిగా ఉన్నప్పుడు ..ఆ క్షణాలను గుర్తుచేసుకుంటే…అంతకు మించి భయానకంగా అనిపిస్తుంది. గాయమైన 15 రోజుల తర్వాత నేను కారులో కూర్చోవడం సురక్షితంగా అనిపించలేదు. నాకు ఎన్ని గాయాలయ్యాయో తెలియదు. షాక్లో ఉన్నాను. ఆ పరిస్థితులను స్పష్టంగా గమనించలేకపోయానని’ ప్రమాదం తర్వాత తన మానసిక స్థితిని గురించి చెప్పుకొచ్చింది మలైకా.
తాను శారీరకంగా పూర్తిగా దృఢంగా ఉన్నట్లు అనిపిస్తుంది..కానీ తన మనస్సులో మాత్రం ఇప్పటికీ భయం, ఆందోళన ఉన్నాయని అంది మలైకా అరోరా.