Malaika Arora | బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్, యోగా బ్యూటీ మలైకా అరోరా (Malaika Arora) సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో బిజీగా ఉండే ఈ భామ టైం దొరికితే ఏదైనా వెకేషన్ ప్లాన్ చేసుకుంటుంది. బాయ్‌ఫ్రెండ్ అర్జున్ కపూర్ (Arjun Kapoor )తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ నెట్టింట హాట్ టాపిక్‌గా మారే ఈ భామ.. తాజాగా అదిరిపోయే వెకేషన్ స్టిల్స్‌ను అందరితో పంచుకుంది.
మలైకా, అర్జున్ కపూర్ ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన యూరప్‌కు వెళ్లారు. నీతో ఉన్నప్పుడు వెచ్చగా, హాయిగా ఉంది.. అంటూ అందమైన లేక్వ్యూలో అర్జున్‌తో కలిసి దిగిన సెల్ఫీని ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది మలైకా అరోరా. మరోవైపు మలైకా సింగిల్ లేన్ రోడ్డుపై వెళ్తుంటే కెమెరాలో బంధించాడు అర్జున్ కపూర్. పేరు లేని వీధుల్లో.. అంటూ ఈ ఫొటోకు మలైకా క్యాప్షన్ ఇచ్చింది. మలైకా అరోరా యూరప్ వెకేషన్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
అర్జున్ కపూర్ ప్రస్తుతం ది లేడీ కిల్లర్, మేరీ పత్నీ కా రీమేక్ చిత్రాల్లో నటిస్తుండగా.. షూటింగ్ దశలో ఉన్నాయి. గతేడాది An Action Hero లో మెరిసింది మలైకా అరోరా. ప్రస్తుతం డ్యాన్సింగ్ రియాలిటీ షో India’s Best Dancerకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
మలైకా అరోరా, అర్జున్ కపూర్ వెకేషన్ స్టిల్స్ ఇలా..