Sree Vishnu | ప్రతి సినిమాలో పాత్రలపరంగా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నారు యువ హీరో శ్రీవిష్ణు. ఇటీవల ‘ఓం భీమ్ బుష్’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించిన ఆయన తాజాగా ‘శ్వాగ్’ చిత్రంలో నటిస్తున్నారు. హసిత్‌గోలి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శుక్రవారం వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో శ్రీవిష్ణు.. భవభూతి అనే స్త్రీ ద్వేషి పాత్రలో కనిపించారు.
అతని లుక్స్, మేకోవర్ సరికొత్తగా ఉంది. భవభూతి పాత్రలో శ్రీవిష్ణు అద్భుతమైన నటనను కనబరిచాడని, ఆద్యంతం వినోదాత్మక అంశాలతో సినిమా ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. రీతూవర్మ, మీరా జాస్మిన్, దక్ష నగార్కర్, శరణ్యప్రదీప్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వేదరామన్ శంకరన్, సంగీతం: వివేక్‌సాగర్, రచన-దర్శకత్వం: హసిత్‌గోలి.