బాణాలకు నెత్తుటి తానాలు పోయాలి..
అగ్ర కథానాయిక రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘మైసా’.
అగ్ర కథానాయిక రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘మైసా’. స్త్రీశక్తిని, మహిళా సాధికారతను చాటిచెప్పే స్ఫూర్తివంతమైన కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో గోండ్ తెగకు చెందిన గిరిజన అమ్మాయి పాత్రలో కనిపించనుంది రష్మిక మందన్న. ఈ చిత్రానికి రవీంద్ర పుల్లె దర్శకుడు. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో సోమవారం మ్యూజికల్ ప్రమోషన్స్‌కు శ్రీకారం చుడుతూ ‘ఓ మైసా రే’ అనే తొలి గీతాన్ని విడుదల చేశారు. జేక్స్ బిజోయ్ స్వరపరచిన ఈ పాటను సుద్దాల అశోక్‌తేజ రచించారు. సింధూజ శ్రీనివాసన్ ఆలపించారు.
‘శత్రువుల కుత్తుకపై కత్తులనే నూరాలి రా.. బాణాలకు నెత్తుటితో తానాలు పోయాలిరా’ అంటూ సాగిన ఈ పాటలో మైసాను ఈషి, ఐషి రూపాల్లో ఆవిష్కరించారు. స్త్రీ తాలూకు దైవిక శక్తినీ, ధైర్యసాహసాలను ఈ గీతం ప్రతిబింబించింది. అటవీ నేపథ్యంలో వందలాది డ్యాన్సర్లతో తెరకెక్కిన ఈ పాటలోని విజువల్స్ కూడా హైలైట్‌గా నిలిచాయి. ఈశ్వరీ రావు, గురు సోమసుందరం, రావు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, నిర్మాణం: అన్‌ఫార్ములా ఫిల్మ్స్, రచన-దర్శకత్వం: రవీంద్ర పుల్లె.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

