SSMB 29 | తెలుగు, తమిళంతోపాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటి ఎస్ఎస్ఎంబీ 29 (SSMB 29). టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Maheshbabu)- ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) కాంబోలో గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్టుగా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా కోసం మేకోవర్ మార్చేశాడని తెలిసిందే.
లాంగ్ హెయిర్‌తో స్టైలిష్‌గా కనిపించబోతున్నట్టు నెట్టింట హల్ చల్ చేస్తున్న లుక్స్ చెప్పకనే చెబుతున్నాయి. తాజాగా జైపూర్ ఎయిర్‌పోర్టులో గుబురు గడ్డం, పోనీ టెయిల్‌తో కనిపించి ఔరా అనిపిస్తు్న్నాడు. ఎస్ఎస్ఎంబీ 29 ఎలా ఉండబోతుందో ఈ ఒక్క లుక్‌తో హింట్ ఇచ్చేస్తున్నాడంటూ అభిమానులు, మూవీ లవర్స్ తెగ చర్చించుకుంటున్నారు. ఆఫ్రికన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్‌గా ఇంటర్నేషనల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.
కాగా ఈ మూవీలో మహేశ్ బాబు పాత్ర డైలాగ్ డెలివరీ మాండలికం, పదాల ఉచ్చరణ వంటి అంశాలను పాపులర్ నటడుఉ నాజర్ దగ్గరుండి చూసుకోబోతున్నారట. ఇక హాలీవుడ్ స్టార్‌తో వివిధ భాషలకు చెందిన నటీనటులు ఎస్ఎస్ఎంబీ 29లో కనిపించబోతున్నారని ఇన్సైడ్ టాక్. ఈ చిత్రాన్ని 2027 మొదటి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని జక్కన్న టీం ప్లాన్ చేస్తుంది.
Superstar #MaheshBabu along with his family at jaipur airport #SSMB29pic.twitter.com/lrBNk6E2z5
— Suresh PRO (@SureshPRO_) August 11, 2024
They Call Him OG | పవన్ కల్యాణ్ బ్యాక్ టు సెట్స్.. ఓజీ షూట్ డేట్ ఫిక్సయినట్టే..?
Matka | వరుణ్ తేజ్ మట్కా కింగ్ వాసు లుక్ అదిరింది.. !