Kurchi Madathapetti | ప్రతీ యేటా సోషల్ మీడియాను షేక్ చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచే పాటలు కొన్నుంటాయి. ఈ జాబితాలో టాప్‌లో ఉంటుంది కుర్చీమడతపెట్టి (Kurchi Madathapetti) సాంగ్. మహేశ్ బాబు-శ్రీలీల కాంబోలో వచ్చిన ఈ పాట గుంటూరు కారం (Guntur kaaram) సినిమాకే హైలెట్‌గా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే కుర్చీ మడతపెట్టి సాంగ్ మాత్రం ఓ వైపు నెట్టింట ట్రోల్స్ వచ్చినప్పటికీ.. మరోవైపు వాటిన్నింటినీ బీట్ చేస్తూ మిలియన్ల సంఖ్యలో వ్యూస్‌తో సినిమాకు సూపర్ హైప్ క్రియేట్ చేసింది. ఇప్పటికే యూట్యూబ్ మ్యూజిక్ ఈ పాటను 2024కిగాను ఇండియా అఫీషియల్ టాప్ సాంగ్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ పాట అదిరిపోయే ఫీట్‌ను నమోదు చేసింది. యూట్యూబ్‌లో కుర్చీ మడత పెట్టి ఫుల్ వీడియో సాంగ్ 550 మిలియన్ల వ్యూస్ సాధించి అరుదైన రికార్డు నమోదు చేసింది. ఈ పాట రిలీజ్ చేసిన కొత్తలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్, డైరెక్టర్ త్రివిక్రమ్‌పై ట్రోల్స్ వచ్చాయి. అయితే క్యాచీ ట్యూన్, అదిరిపోయే స్కోర్, స్టన్నింగ్ కొరియోగ్రఫీ కుర్చీ మడతపెట్టి సాంగ్‌కు ఖండాంతరాల్లో క్రేజ్ తెచ్చిపెట్టాయి.
ఇప్పటికే కుర్చీ మడతపెట్టి బీట్‌కు చీరకట్టులో, మోడ్రన్ డ్రెస్సులలో అమ్మాయిలు ఇరగదీసే ఊరమాస్ స్టెప్పులేస్తూ నెట్టింట చేసిన రీల్స్ ఆన్లైన్లో హల్ చల్ చేస్తున్నాయి. మరోవైపు టెక్సాస్ టయోటా సెంటర్లో నిర్వహించిన ఎన్బీఏ గేమ్ ఈవెంట్లో కూడా కుర్చీ మడతపెట్టి పాటకు చిన్నారులు డ్యాన్స్ చేసిన వీడియో కూడా వైరల్ అయింది.
కుర్చీమడతపెట్టి సాంగ్..
Venkatesh | బ్రేక్ తీసుకొని వెకేషన్లో వెంకటేశ్.. ఇంతకీ ఇప్పుడెక్కడున్నాడో తెలుసా..?