Mahesh Babu | త్వరలోనే ఎస్ఎస్ఎంబీ 29 ప్రాజెక్ట్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) మహేశ్ బాబు సినిమాలతోపాటు యాడ్స్‌కు కూడా సూపర్ క్రేజ్ ఉంటుంది. ఇదిలా ఉంటే ఇటీవలే మహేశ్ బాబు యాడ్ షూట్లో పాల్గొన్న స్టిల్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుందని తెలిసిందే. జీన్స్ అండ్ టీషర్ట్‌లో తాజా లుక్‌లో కనిపిస్తున్న మహేశ్ బాబు చేస్తున్న ఆ కమర్షియల్ ఏంటా.. అని తెగ చర్చించుకుంటున్నారు నెటిజన్లు, మూవీ లవర్స్.
దీనిపై క్లారిటీ వచ్చేసింది. సన్‌టెక్ ఎనర్జీ సిస్టిమ్స్ TRUZON SOLARకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు మహేశ్ బాబు. పర్యావరణానికి అనుకూలమైన సుస్థిర, పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఈ ఎండార్స్‌మెంట్‌ను ప్రమోట్ చేస్తున్నాడు మహేశ్ బాబు.
ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ..సమాజానికి, పర్యావరణానికి అనుకూలమైన సోలార్ ఎనర్జీని అందించే బ్రాండ్‌తో భాగస్వామ్యం అవుతుండటం సంతోషంగా ఉంది. రాబోయే తరాల భవిష్యత్‌లో స్థిరమైన శక్తి (Sustainable energy) కీలక పాత్ర పోషిస్తుందన్నాడు. సోలార్ పవర్‌పై అవగాహన కల్పించడంలో భాగంగా TRUZON SOLARతో మహేశ్ బాబు అసోసియేట్ అవడం మరింత కలిసొస్తుందని సన్ టెక్ ఫౌండర్ సీహెచ్ భవానీ సురేశ్ అన్నారు.
SuperStar #MaheshBabu Joins Hands with #TruZonSolar by SunTek to Lead India Towards sustainable energy ☀️⚡💡 @urstrulyMahesh @TruzonSolar pic.twitter.com/vDGUDJXQe3
— Suresh PRO (@SureshPRO_) November 22, 2024
RC16 | రాంచరణ్ ఆర్సీ16 షూట్ టైం.. మైసూర్ టెంపుల్ ముందు బుచ్చి బాబు సాన
Dhanush | 2025 ఫస్ట్ హాఫ్‌ను టేకోవర్ చేసిన ధనుష్.. కుబేర సహా 3 సినిమాలు