e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home News యాక్ష‌న్ కింగ్‌ని ఢీకొట్ట‌నున్న సూప‌ర్ స్టార్

యాక్ష‌న్ కింగ్‌ని ఢీకొట్ట‌నున్న సూప‌ర్ స్టార్

యాక్ష‌న్ కింగ్‌ని ఢీకొట్ట‌నున్న సూప‌ర్ స్టార్

ఒక‌ప్పుడు యాక్ష‌న్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన అర్జున్ స‌ర్జా ప్ర‌స్తుతం నెగెటివ్ పాత్ర‌ల‌ను చేస్తున్నారు. ప‌లు సినిమాల‌లో విల‌న్‌గా న‌టించి అలరించిన అర్జున్ ఇప్పుడు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టిస్తున్న స‌ర్కారు వారి పాట చిత్రంలో విల‌న్‌గా క‌నిపించ‌నున్న‌ట్టు జోరుగా ప్రచారం న‌డుస్తుంది. ఇటీవ‌ల ద‌ర్శ‌కుడు.. అర్జున్‌కు క‌థ వివ‌రించ‌గా, ఆ పాత్ర న‌చ్చ‌డంతో వెంట‌నే ఓకే చెప్పేశార‌ట‌.

జూలైలో ‘సర్కారు వారి పాట’ కొత్త షెడ్యూల్‌ ప్రారంభించాలని అనుకుంటున్నారు. అందులో మహేశ్‌, అర్జున్‌పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారట. దుబాయ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న స‌ర్కారు వారి పాట చిత్ర బృందం తాజా షెడ్యూల్ హైద‌రాబాద్‌లో జ‌రుపుకోనుంది. కాగా, అర్జున్ చివ‌రిగా అల్లు అర్జున్ న‌టించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’లో అర్జున్‌ నటించారు. స‌ర్కారు వారి పాట చిత్రాన్ని ప‌ర‌శురాం తెర‌కెక్కిస్తుండ‌గా, ఇందులో కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
యాక్ష‌న్ కింగ్‌ని ఢీకొట్ట‌నున్న సూప‌ర్ స్టార్

ట్రెండింగ్‌

Advertisement