Mahesh Babu | హాలీవుడ్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్స్ ప్రాజెక్టుల్లో టాప్‌లో ఉంటుంది ది లయన్ కింగ్. ఈ క్రేజీ ప్రాజెక్టుకు ప్రీక్వెల్‌గా వస్తోంది ముఫాసా: ది లయన్ కింగ్ (Mufasa The Lion King). ఈ మూవీ డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. కాగా ఈ మూవీ హిందీ వెర్షన్లో ముఫాసా పాత్రకు బాలీవుడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్ వాయిస్ ఓవర్ అందించాడని తెలిసిందే.
ఇక తెలుగు వెర్షన్‌కు టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు వాయిస్ అందించాడు. తాజా సమాచారం ప్రకారం తెలుగు ట్రైలర్ ఆగస్టు 26న ఉదయం 11:07 గంటలకు లాంచ్ చేయనుండగా.. ఈవెంట్లో మహేశ్ బాబు సందడి చేయనున్నాడని సమాచారం. లయన్ కింగ్ సినిమాకు తెలుగుతోపాటు హిందీ ఆయా భాషల్లో పలువురు నటులు డబ్బింగ్ చెప్పారని తెలిసిందే. ఇక తెలుగు లయన్ కింగ్ లోని సింబా పాత్రకు నాని డబ్బింగ్ చెప్పాడు.
ది లయన్ కింగ్‌లో మొదటి రెండు (The Lion King) పార్ట్‌లలో అడవికి రారాజుగా ఉన్న ముఫాసా తన రాజ్యాన్ని కాపాడుతూ ఉండడం అతడికి సింబా అనే కుమారుడు జన్మించడం చూడవచ్చు. అయితే ఈ ప్రీక్వెల్‌లో ముఫాసా అడవికి రాజుగా అసలు ఎలా ఎదిగాడు అతడికి సోదరుడు ఉన్న టాకా ఎలా చనిపోయాడు..? అలాగే ముఫాసా చంపాలని చూస్తున్నా స్కార్ ఏం చేశాడు..? అనేది సినిమా స్టోరీ. ఫొటో రియలిస్టిక్ టెక్నాలజీతో వస్తున్న ఈ సినిమాకు అకాడమీ అవార్డ్ విజేత బేరీ జెంకిన్స్ దర్శకుడు ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ జూనియర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Bringing the supreme king of the jungle to life. Excited to present Superstar @urstrulyMahesh as the voice of Mufasa in Telugu.
Watch Telugu trailer releasing on Monday#MufasaTheLionKing pic.twitter.com/5BHRE12Eg3— Walt Disney Studios India (@DisneyStudiosIN) August 21, 2024
Yuvaraj Singh | తెరపైకి క్రికెటర్ యువరాజ్ సింగ్ బయోపిక్.. వివరాలివే
SDGM | మాస్ ఫీస్ట్ పక్కా.. గోపీచంద్ మలినేని ఎస్డీజీఎంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్..!