బుల్లితెరపై సంచలనాలు సృష్టిస్తోంది ఎవరు మీలో కోటీశ్వరులు షో. జెమిని టీవీలో ప్రసారం అవుతున్న ఈ షోకు హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ అట్రాక్షన్. ఇదివరకు మీలో ఎవరు కోటీశ్వరుడుగా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన ఈ షో.. తాజాగా ఎవరు మీలో కోటీశ్వరుడు పేరుతో ప్రసారం అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్.. తనదైన హోస్టింగ్ స్టయిల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.
ప్రస్తుతం ఈ షో టీఆర్పీలలో కూడా దూసుకుపోతోంది. రియాల్టీ షో బిగ్ బాస్‌ను మించిన టీఆర్పీతో దూసుకుపోతున్న ఈ షోలో సామాన్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు.
ఈ షో ప్రారంభం అవడమే రామ్ చరణ్ స్పెషల్ ఎపిసోడ్‌తో ప్రసారం అయింది. ఆ తర్వాత చాలామంది సెలబ్రిటీలు ఈ షోలో పార్టిసిపేట్ చేశారు. త్వరలో సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేయనున్నారట.
నిజానికి.. మహేశ్ బాబు.. చాలా రిజర్వ్డ్. ఆయన ఇటువంటి షోలలో అసలు పాల్గొనరు. బయట వేడుకల్లో కూడా ఆయన చాలా తక్కువగా కనిపిస్తారు. బుల్లితెర మీద వచ్చే ఏ షోలలోనూ ఇప్పటి వరకు ఆయన కనిపించలేదు. కానీ.. ఎవరు మీలో కోటీశ్వరులు షోలో మాత్రం ఆయన పాల్గొన్నారు.
దీంతో అందరూ మహేశ్ ఎపిసోడ్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఎపిసోడ్ ఆఫ్ ది డికేడ్ అనే పేరుతో త్వరలో జెమిని టీవీలో ఈ స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా జెమిని టీవీ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ పోస్టర్లో మహేశ్ కనిపిస్తాడు. ఎన్టీఆర్.. తనతో ఏదో మాట్లాడుతూ కనిపిస్తున్న ఆ పోస్టర్‌ను చూసి.. మహేశ్ అభిమానులు అయితే అస్సలు ఆగడం లేదు. ఇద్దరు స్టార్ హీరోలు.. ఒకే తెరపై కనిపించడం అది కూడా బుల్లితెర కావడంతో ఎప్పుడెప్పుడు ఆ ఎపిసోడ్ ప్రసారం అవుతుందా అని తెగ ఆరాటపడుతున్నారు. అయితే.. ఈ షో ఎప్పుడు ప్రసారం అవుతుందో జెమిని టీవీ ఇంకా ప్రకటించలేదు.
Evaru Meelo Koteeswarulu | Gemini TV
— Gemini TV (@GeminiTV) November 20, 2021
Get ready to watch the episode of the decade soon on Gemini TV. #PoonakaalaEpisodeLoading #EMKbyNTRonGeminiTV #EvaruMeeloKoteeswaruluOnGeminiTV #EvaruMeeloKoteeswarulu pic.twitter.com/xlrBgnwuLS
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Chiranjeevi: చిరంజీవి చెల్లెలుగా సీనియర్ హీరోయిన్.. ట్విస్ట్ బాగుంది..!
చిరంజీవి-సల్మాన్‌ఖాన్ స్పెషల్ సాంగ్ ఉండబోతుందా..?
Keerthy Suresh: చెల్లెలు పాత్ర కోసం రెండు కోట్ల రెమ్యునరేషనా..!
మెగాస్టార్ చిరంజీవితో త్రివిక్రమ్ సినిమా ఫిక్స్.. నిర్మాత ఎవరో తెలుసా..?