టాలీవుడ్ (Tollywood) సీనియర్ హీరో బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న షో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే (Unstoppable). ‘ఆహా’ (Aha OTT)లో ప్రసారమవుతున్న ఈ టాక్ షోలో ఇప్పటికే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, న్యాచురల్ స్టార్ నాని సందడి చేశారు. మరో టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) కూడా ఈ షోలో సందడి చేయనున్న సంగతి తెలిసిందే. తాజాగా మహేశ్ బాబు ఎపిసోడ్కు సంబంధించిన అప్ డేట్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. త్వరలోనే మహేశ్ బాబు డిజిటల్ ప్లాట్ ఫాంలో సందడి చేయబోతున్నాడు.
తాజా అప్డేట్ ప్రకారం డిసెంబర్ 4న మహేశ్ బాబు-బాలకృష్ణ ఒకే వేదికపై కనిపించనున్నారన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మొత్తానికి బాలయ్య, మహేశ్ అరుదైన కాంబినేషన్ మరో 2-3రోజుల్లో రానుందన్న దానిపై అధికారిక అప్ డేట్ లేకున్నా…ఈ వార్తను మాత్రం ఇద్దరు హీరోల అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. బాలకృష్ణ నటిస్తోన్న తాజా చిత్రం అఖండ డిసెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాలయ్య అభిమానులకు రెండు, మూడు రోజుల్లో డబుల్ ట్రీట్ ఉండబోతుందని తెలిసిపోతుంది.
ఇవి కూడా చదవండి..
‘మీరు లేక ఏకాకి జీవితం మాది’..సిరివెన్నెలకు టాలీవుడ్ తారల నివాళి
shiva shankar master | వెన్నెముక గాయం.. ఎనిమిదేళ్లు మంచంపైనే.. అయినా 800 సినిమాలకు కొరియోగ్రఫీ
shiva shankar | శివ శంకర్ మాస్టర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
Sirivennela | తొలి పాటకే ప్రేక్షకుల గుండెల్లో చోటు