SSMB 29 | ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli). మరోసారి జక్కన్న అంతర్జాతీయ వేదిక మీద తెలుగు సినిమా సత్తా చాటేందుకు మహేశ్‌బాబు (Mahesh Babu) సినిమాతో రెడీ అవుతున్నాడని తెలిసిందే. హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఎస్ఎస్ఎంబీ 29 (ssmb29)కి ప్లాన్ చేస్తున్నాడు. గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్టుగా రాబోతున్న ఎస్ఎస్ఎంబీ 29 ఎలా ఉండబోతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ లవర్స్ కోసం ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
జంగిల్ అడ్వెంచర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో మహేశ్ బాబు పాత్ర లార్డ్హనుమాన్ స్ఫూర్తిగా సాగనుందని తాజా వార్త ఒకటి తెరపైకి వచ్చింది. ‘ ఎస్ రాజమౌళి రామాయణం, మహాభారతాలను స్ఫూర్తిగా తీసుకునేందుకు ఇష్టపడతారు. భారతీయ సంస్కృతిలో నుంచి పుట్టే సినిమాలు చేస్తాడు. ఆయన చేస్తున్న ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్ ఎస్ఎస్ఎంబీ 29లో మహేష్ బాబు పాత్రలో హనుమంతునికి సారుప్యత కలిగిన లక్షణాలుంటాయి. ఆయన పాత్ర అడవిలో ఉన్న అన్ని అసమానతలతో పోరాడిన చరిత్రను కలిగి ఉంటుంది. ఈ పాత్ర రామాయణం టచ్‌తో.. ఎస్ఎస్ రాజమౌళి స్టైల్లో సాగుతుందని’ ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
ఎస్ఎస్ఎంబీ 29 ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ దశలో ఉంది. ఈ ఏడాది చివరలో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు జరుపుతున్నట్టు ఇన్సైడ్ టాక్. ఎస్ఎస్ఎంబీ 29 భారతీయ సినిమాలో అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా తెరకెక్కనుంది. ఎస్ఎస్ఎంబీ 29లో ఎక్కువ భాగం అమెజాన్ ఫారెస్ట్‌లో చిత్రీకరించబడుతుందని సమాచారం. ఈ చిత్రం ఇండియానా జోన్స్ లాంటి అడ్వెంచర్ జోనర్లో ఉంబోతుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు జక్కన్న.
Dheekshith Shetty | నవదీప్‌తో దసరా యాక్టర్ దీక్షిత్ శెట్టి తెలుగు ప్రాజెక్ట్.. వివరాలివే
Bobby Kolli | బాబీ క్రేజీ అప్డేట్.. నిన్న మెగాస్టార్.. నేడు సూపర్ స్టార్
Birth Of Bhuvana Vijayam | ఫీలింగ్ స్టార్ ప్రీతమ్ కుమార్‌గా సునీల్.. భువన విజయమ్ వీడియో వైరల్