Birth Of Bhuvana Vijayam | ఫీలింగ్ స్టార్ ప్రీతమ్ కుమార్‌గా సునీల్.. భువన విజయమ్ వీడియో వైరల్
సునీల్ (Sunil) ప్రధాన పాత్రలో క్రైం కామెడీ థ్రిల్లర్ జోనర్లో వస్తున్నభువన విజయమ్ (Bhuvana Vijayam). మేకర్స్ ఇప్పుడు మరో అప్డేట్ అందించారు. తాజాగా భువన విజయమ్ నుంచి Birth Of Bhuvana Vijayam వీడియోను లాంఛ్ చేశారు.
టాలీవుడ్ యాక్టర్ సునీల్ (Sunil) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం భువన విజయమ్ (Bhuvana Vijayam). క్రైం కామెడీ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ చిత్రాన్ని యలమంద చరణ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన భువన విజయమ్ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌తోపాటు కథన కదనమున లిరికల్ వీడియో సాంగ్ (థీమ్ సాంగ్) సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. మేకర్స్ ఇప్పుడు మరో అప్డేట్ అందించారు. తాజాగా భువన విజయమ్ నుంచి Birth Of Bhuvana Vijayam వీడియోను లాంఛ్ చేశారు.
ఫీలింగ్ స్టార్ ప్రీతమ్ కుమార్ పాత్రలో సునీల్ కనిపించబోతున్నట్టు తెలియజేశాడు చరణ్. హేయ్ నారాయణా.. ఆర్నెళ్లుగా కథలు వింటున్నాం. అన్నీ అవే రెగ్యులర్ కథలు.. వినీ వినీ బాగా బోర్ కొట్టేసింది. మంచి కథ ఉంటే చూడు. కొత్త సినిమా సైన్ చేద్దాం.. చాలా కొత్తగా ఉండాలబ్బాయి అంటున్నాడు సునీల్. ఇంతకీ ప్రీతమ్ కుమార్ సినిమా చేశాడా..? లేదా..? అన్నది సస్పెన్స్ లో పెట్టాడు దర్శకుడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. భువన విజయమ్లో థర్టీ ఇయర్స్ పృథ్విరాజ్, జబర్ధస్త్ రాఘవ, షేకింగ్ శేషు, గోపరాజు రమణ, ధన్ రాజ్, వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
శ్రీమతి లక్ష్మి సమర్పణలో హిమాలయ స్టూడియో మ్యాన్షన్స్ బ్యానర్‌పై కిరణ్, వీఎస్కే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సునీల్ మరోవైపు స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్-రజినీకాంత్ కాంబోలో వస్తోన్న జైలర్‌లో వన్ ఆఫ్ ది కీ రోల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన సునీల్ జైలర్ లుక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. వీటితోపాటు తమిళ సినిమాలు మార్క్ ఆంటోనీ, జపాన్, మావీరన్, మిస్టర్ కింగ్ సినిమాలు చేస్తున్నాడు సునీల్.
Birth Of Bhuvana Vijayam వీడియో..
Story of Storytellers 📕
Exploring the Birth of #BhuvanaVijayam 💫
▶️ : https://t.co/Xm2mTKl35Y@suniltollywood @vennelakishore @harshachemudu @DhanrajOffl #YalamandaCharan @mirthhimalaya @adityamusic @teju9666 @CineDigital_ pic.twitter.com/BxzQgb4apL
— BA Raju’s Team (@baraju_SuperHit) April 12, 2023
భువన విజయమ్ టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

