Bobby Kolli | బాబీ క్రేజీ అప్డేట్.. నిన్న మెగాస్టార్.. నేడు సూపర్ స్టార్ !
Bobby Kolli | టాలీవుడ్లో టాలెంటెడ్ దర్శకుల జాబితాలో ముందు వరుసలో ఉంటాడు (Bobby Kolli) బాబీ (కేఎస్ రవీంద్ర). ఈ ఏడాది ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని వాల్తేరు వీరయ్యగా చూపించాడు బాబీ. కాగా ఇప్పుడు బాబీ మరో భారీ జాక్ పాట్ కొట్టేశాడన్న వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
Bobby Kolli | టాలీవుడ్లో టాలెంటెడ్ దర్శకులకు కొదవేమీ లేదని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటాడు (Bobby Kolli) బాబీ (కేఎస్ రవీంద్ర). ఈ ఏడాది ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని వాల్తేరు వీరయ్యగా పక్కా ఊరమాస్ రోల్లో చూపించి అభిమానులకు బొనాంజా గిఫ్ట్ అందించాడు బాబీ. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది.కాగా ఇప్పుడు బాబీ మరో భారీ జాక్ పాట్ కొట్టేశాడన్న వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
ఇంతకీ విషయమేంటనుకుంటున్నారా..? బాబీ ఈ సారి ఏకంగా సూపర్ స్టార్‌తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) కోసం బాబీ పవర్ ఫుల్ స్క్రిప్ట్ చేశాడని ఇన్సైడ్ టాక్. తలైవాను వింటేజ్ మాస్ క్యారెక్టర్లో చూపించేలా కథ రెడీ చేశాడని, త్వరలోనే బాబీ కోలీవుడ్ డెబ్యూపై అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యున్నత సాంకేతిక విలువలతో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కించనున్నారట. రజినీకాంత్ ప్రస్తుతం నటిస్తోన్న జైలర్ సినిమా పూర్తయిన తర్వాత బాబీ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందట. త్వరలోనే మరిన్ని వివరాలపై క్లారిటీ రానుందని టాక్.
రజినీకాంత్ అంటేనే స్టైలిష్ యాక్టింగ్‌కు కేరాఫ్ అడ్రస్. మరి ఏడు పదుల వయస్సు దాటిన తలైవాను బాబీ సిల్వర్ స్క్రీన్‌పై మాస్ క్యారెక్టర్లో ఎలా చూపించబోతున్నాడన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. ఇదే నిజమైతే కెరీర్లో తక్కువ టైంలో సూపర్ స్టార్‌ను డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్న యువ దర్శకుల జాబితాలో చేరిపోనున్నాడు బాబీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

