Sarkaru vaari paata | టాలీవుడ్లో ఇప్పుడు వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు మహేశ్‌బాబు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్‌ను అందుకున్నాడు. ఇప్పుడు సర్కార్ వారి పాట సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మహేశ్‌బాబు. పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సమ్మర్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ మహేశ్‌బాబు మోకాలికి సర్జరీ జరగడంతో సినిమా షూటింగ్ రెండు నెలల పాటు వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది.
2020 సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో వచ్చి బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు మహేశ్‌బాబు. దీంతో తన తర్వాతి సినిమా సర్కారు వారి పాటను 2022 సంక్రాంతికి తీసుకురావాలని మహేశ్ అనుకున్నాడు. ఇదే విషయాన్ని డైరెక్టర్ పరశురామ్‌కు కూడా స్పష్టం చేశాడు. దానికి తగ్గట్టే షూటింగ్‌ను కూడా ప్లాన్ చేసుకున్నారు. కానీ కరోనా కారణంగా షూటింగ్ కాస్త ఆలస్యమైంది. అదికాకుండా సడెన్‌గా సంక్రాంతి బరిలోకి ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్ వంటి పాన్ ఇండియా సినిమాలు వచ్చి చేరాయి. దీంతో సైలెంట్‌గా తప్పుకున్న సూపర్ స్టార్.. తన సినిమాను సమ్మర్‌కు వాయిదా వేసుకున్నాడు. ఏప్రిల్ 2న ఈ సినిమాను విడుదల చేస్తామన ప్రకటించారు. ఇదిలా ఉంటే… ఇటీవల మోకాలి సర్జరీ కోసం స్పెయిన్ వెళ్లాడు మహేశ్‌బాబు. అక్కడే రెండు నెలలు ఆయన రెస్ట్ తీసుకుంటారని అప్పట్లో తెలిపారు. దీంతో ఈ సినిమా షూటింగ్ పెండింగ్‌లో పడిపోయింది.
మహేశ్ బాబు కోలుకున్న తర్వాత ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలుపెట్టాలని దర్శక నిర్మాతలు అనుకున్నారు. అయితే సర్జరీ తర్వాత కోలుకున్న మహేశ్‌బాబు ప్రస్తుతం దుబాయిలో ఉన్నారు. ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్, తమన్‌తో కలిసి దుబాయిలో దిగిన ఫొటోను కూడా మహేశ్‌బాబు పోస్టు చేశాడు. ఇదిలా ఉంటే సర్కారు వారి పాట సినిమా షూటింగ్ చివరి దశకు చేరింది. దీంతో త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెడితే బాగుంటుందని మహేశ్ భావించాడట. ఇదే విషయాన్ని డైరెక్టర్ పరశురామ్‌కు చెప్పినట్లు సమాచారం. మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జనవరిలోనే షూటింగ్‌ను మొదలుపెట్టి వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు 14 రీల్స్‌తో కలిసి మహేశ్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పుష్ప సినిమా కోసం సుకుమార్ ముందు అనుకున్నది అల్లు అర్జున్ను కాదంట
Mahesh Trivikram movie | ట్రాక్‌పైకి మహేశ్-త్రివిక్రమ్ సినిమా..ఇదే సాక్ష్యం
Mahesh Babu | మహేశ్‌బాబు ఖాతాలో అరుదైన రికార్డు..!
మహేష్ సినిమాపై రాజమౌళికి ప్రశ్న.. స్పందన ఏంటో తెలుసా?