Khaleja | మహేశ్ బాబు కెరీర్లో భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సినిమాల్లో ఒకటి ఖలేజా (Khaleja). త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 30న రీరిలీజ్ కానుంది. సినిమా విడుదలైన చాలా ఏండ్లు అయినప్పటికీ ఈ చిత్రానికి సెఫరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. రీరిలీజ్‌పై ప్రీ సేల్స్ అంశంలో సరికొత్త బెంచ్‌మార్క్ నమోదు చేసి అభిమానుల్లో మరింత క్యూరియాసిటీని పెంచేస్తుంది.
ఖలేజా రీరిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఇటీవల మూవీ నిర్మాతల్లో ఒకరైన సీ కల్యాణ్ చేసిన బోల్డ్ కామెంట్స్ ప్రస్తుతం నెట్టంట రౌండప్ చేస్తున్నాయి. 2010లో సినిమా ఒరిజినల్ రిలీజ్ గురించి ఆయన మాట్లాడుతూ.. బాక్సాఫీస్ వద్ద మహేశ్ బాబు అభిమానులే స్వయంగా సినిమాను చంపేశారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. మహేశ్ బాబు అభిమానులు ప్రత్యేక అంచనాలతో థియేటర్లకు వచ్చారు. అయితే సినిమా చూసిన తర్వాత అంచనాలు అందుకోలేకపోవడంతో నిరాశే మిగిలిందంటూ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో చాలా మంది అభిమానులు వ్యక్తిగతంగా విమర్శించారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ అభిమానులే బిగ్ స్క్రీన్‌పై మరోసారి సినిమా చూసేందుకు ఎదురుచూస్తున్నారు.
బహుశా ఖలేజా బాకీ బడ్డది కేవలం 15 ఏండ్ల తర్వాతే తిరిగి చెల్లించాలని రాసి పెట్టుందేమోనన్నారు సీ కల్యాణ్. గతంలో మిస్సయిన గుర్తింపు రీరిలీజ్ అయిన తర్వాత అయినా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో అనుష్కా శెట్టి, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, అలీ, సునిల్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read Also :
Kamal Hasan | కన్నడ భాషపై కమల్ హాసన్ వ్యాఖ్యలు.. బెంగళూరులో కేసు నమోదు
AK64 | నెక్ట్స్ లెవల్లో అజిత్‌కుమార్ ఏకే 64 .. క్రేజీ వార్తేంటో తెలుసా..?