Manchu Manoj | చాలా రోజుల తర్వాత మంచు మనోజ్ భైరవం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ అనేక ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంటున్నారు. మంచు మనోజ్ పర్సనల్ లైఫ్ చూస్తే ముందుగా ఆయన ప్రణతిను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెకి విడాకులు ఇచ్చి భూమా నాగిరెడ్డి కుమార్తె మౌనికని వివాహం చేసుకున్నారు. వారి వివాహంకి సంబంధించి ముందు నుండే ప్రచారాలు జరిగాయి. ఆ ప్రచారాన్నే నిజం చేశారు మనోజ్ దంపతులు.అయితే మౌనికని వివాహం చేసుకున్న తర్వాత మనోజ్ చెన్నైలో కొన్నాళ్లు నివసించాడు. ఆ విషయం గురించి తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
మౌనికని వివాహం చేసుకున్న తర్వాత మా ఇంట్లో గొడవలు జరిగాయి. ఆ విషయం పవన్ అన్నకి తెలిసింది. దాంతో ఓ రోజు నన్ను పిలిచి ఏం కనిపించడం లేదు, ఎక్కడ ఉంటున్నావ్, ఏం చేస్తున్నావ్ అని అడిగారు. చెన్నైలో ఉంటున్నా అని చెప్పా. ఎందుకు అక్కడికి వెళ్లావ్ అని పవన్ అన్న నన్ను అడిగారు. నా లైఫ్ లో మౌనిక ఉంది అన్న. హైదరాబాద్ లో ఇబ్బందిగా ఉంది. అందుకే చెన్నైలో ఉంటున్నా. కొద్ది రోజులు అయ్యాక హైదరాబాద్ వద్దామనుకంటున్నా అని చెప్పా. అప్పుడు చెన్నై వచ్చినప్పుడు నేను కలుస్తా ధైర్యంగా ఉండు అని అన్నారు పవన్ అన్న.
నాకు, మౌనికకు సపోర్ట్ ఇచ్చిన ఫస్ట్ పర్సన్ పవన్ అన్న. ఇప్పటి వరకు దాని గురించి ఎప్పుడు చెప్పలేదు. నన్ను షూటింగ్ కు రమ్మంటే అప్పుడు భీమ్లా నాయక్ సెట్స్ కు వెళ్లాను. ఆ సమయంలో చాలా సేపు మాట్లాడారు. క్లాస్ కూడా పీకారు. ముందు ఫిట్ గా తయారవ్వు అని చెప్పారు. “డైట్ చెయ్.. ఏదైనా చెయ్.. బరువు తగ్గాలని చెప్పారు. ఓ హీరోగానే కాకుండా.. ఏ క్యారెక్టర్ అయినా చేయమని నాకు సలహా ఇచ్చారు. నీవు గుడ్ యాక్టర్ అని ఎంకరేజ్ చేశారు. అదే ఇప్పుడు నాకు పనికొచ్చింది. ఇప్పుడు ఏ సినిమా అయినా చేయగలను అన్న ధైర్యం వచ్చింది.. థాంక్యూ పవన్ అన్న.. లవ్ యూ.. అంటూ మనోజ్ మనోజ్.. పవన్ కళ్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.