AK64 | కోలీవుడ్ స్టార్ యాక్టర్ అజిత్‌కుమార్ కు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్ నెట్టింట వైరల్ అవుతూ ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ స్టార్ యాక్టర్ నటిస్తున్న కొత్త ప్రాజెక్టు ఏకే 64 (AK64) . తాజాగా ఈ మూవీపై ఓ ఆసక్తికర వార్త తెరపైకి వచ్చి అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది. ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుందని తెలిసిందే.
అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించబోతున్న ఈ మూవీకి మ్యూజిక్ సెన్సేషన్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. తాజా వార్తల ప్రకారం ఏకే 64 ఈ ఏడాది అక్టోబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. 2026 వేసవిలో విడుదల కానుంది. కాగా ఈ సినిమాను అధిక్ రవిచంద్రన్ మరో లెవల్‌కు తీసుకెళ్లేలా తెరకెక్కించబోతున్నాడట. ఈ చిత్రంలో పాపులర్ అందాల భామలు పూజా హెగ్డే, నయనతారను ఫీ మేల్ లీడ్ రోల్ కోసం తీసుకునే విషయాన్ని మేకర్స్ పరిశీలిస్తున్నట్టు ఇండస్ట్రీ సర్కిల్ క్రేజీ టాక్.
ఇదే నిజమైతే సిల్వర్ స్క్రీన్‌పై ఈ సారి అజిత్‌కుమార్ ఎలా కనిపించబోతున్నాడని సస్పెన్స్ నెలకొంది. గుడ్ బ్యాడ్ అగ్లీ, విదాముయార్చి సినిమాల తర్వాత అజిత్‌కుమార్ నుంచి రాబోతున్న ప్రాజెక్ట్ కావడంతో ఏకే 64పై అంచనాలు భారీగానే ఉన్నాయి.
#AK64 Update ✨🔥✅🤩@adhikravi – @gvprakash – @mythriofficial
Female Lead @nayanthara & @hegdepooja Mams 🔥🤩💐💯💫🌟🙏#AjithKumar #AjithKumarRacing #AK64 pic.twitter.com/TuRK8AoYBV
— Cine Murugan (@anandviswajit) May 29, 2025