Mahesh Babu | ఒక సినిమా విడుదలైన తర్వాత, ఈ పాత్రను నా ఫేవరెట్ హీరో చేస్తే ఎలా ఉండేది? అనే ఆలోచన ప్రతి ప్రేక్షకుడిలోనూ ఒక్కసారైనా వస్తుంది. కానీ, సినిమా ఒక్కసారి రిలీజ్ అయితే ఆ పాత్రలో ఇంకొక హీరోను ఊహించడం మాత్రమే చేయగలం, చూసే అవకాశం మాత్రం ఉండదు. అయితే, ఇవన్నీ పాత కాలం మాటలు. ఇప్పుడు మీమ్స్, సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఈ నూతన ట్రెండ్‌లో క్రాస్ ఓవర్ వీడియోలు పేరిట అభిమానులు తమ ఫేవరెట్ హీరోల డైలాగ్స్‌ను ఇతర సినిమాల సీన్స్‌లో మిక్స్ చేస్తూ విపరీతమైన ఎంటర్టైన్మెంట్ను క్రియేట్ చేస్తున్నారు.
ఇటీవల ఒక ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ విజువల్స్‌తో, మహేశ్ బాబు నటించిన ఖలేజా సినిమాలోని టాక్సీ రాజా క్యారెక్టర్ డైలాగ్స్ మిక్స్ చేశారు. ఈ క్రాస్ ఓవర్ వీడియోలో ఖలేజాలోని ఎవరిగ్రీన్ డైలాగ్స్‌ను ఆర్ఆర్ఆర్ యాక్షన్ సీన్స్‌తో ఫన్నీగా కట్ చేశారు. ఈ వీడియో దాదాపు 2.30 నిమిషాల నిడివితో ఉండగా, ఇది సినిమాటిక్ కామెడీ పండిస్తూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియో ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఇక ఖలేజా విషయానికి వస్తే.. ఈ సినిమా 2010లో విడుదల కాగా, అప్పట్లో ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ దక్కించుకోలేకపోయింది. అయితే ఆ తర్వాత టీవీ ప్రసారాల ద్వారా సినిమా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ముఖ్యంగా మహేశ్ బాబు చెప్పిన డైలాగులు, ఆయన కామెడీ టైమింగ్ సోషల్ మీడియాలో మీమ్స్ టెంప్లేట్స్గా మారాయి. కొంతమంది మీమ్ క్రియేటర్లకు ఖలేజా టెంప్లేట్లు లేకపోతే మీమ్స్ క్రియేట్ చేయలేనంతగా అయిపోయింది! ఈ క్రేజ్‌ను మేకర్స్ కూడా గమనించి ఖలేజా సినిమాను రీసెంట్గా రీ-రిలీజ్ చేశారు. ఈసారి మాత్రం థియేటర్లలో సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక ప్రస్తుతం మహేశ్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రియాంక చోప్రా కూడా పవర్ ఫుల్ రోల్ పోషిస్తుంది.
Khaleja x RRR Crossover#MaheshBabu #RamCharan #JrNTR @urstrulyMahesh @ssrajamouli @AlwaysRamCharan @tarak9999 pic.twitter.com/b09JInguKd
— Charan Crossovers (@CharanCrossover) June 21, 2025