Maharaja | ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం మహారాజ అనే పేరు మార్మోగిపోతుంది. ఇందులో రెండు మహారాజులు ఉండగా.. ఒకటి హిందీ నుంచి రాగా.. మరోకటి తమిళం నుంచి వచ్చి రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మహారాజ (Maharaja). భారీ అంచనాల నడుమ జూలై 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. తమిళనాడులో అయితే ఏకంగా రూ.100 కోట్ల వసూళ్లును రాబట్టింది ఈ చిత్రం. అయితే ఈ సినిమా రీసెంట్గా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చి రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది.
ఇదిలావుంటే.. ఈ సినిమా కంటే ఒక వారం ముందు మహారాజ్ పేరుతో మరో సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యింది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మహారాజ్(Maharaj). ఈ సినిమాకు సిద్దార్థ్ పి మల్హోత్రా దర్శకత్వం వహించగా.. బాలీవుడ్‌లోని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘యష్ రాజ్ ఫిల్మ్స్’ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు.
ఇది జునైద్ ఖాన్‌కు తొలి చిత్రం కాగా.. ఈ సినిమా విడుదలకు ముందే హిందుల మనోభావాలను దెబ్బతీస్తుందంటూ చిక్కుల్లో పడడంతో నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. దీంతో రెండు సినిమాలు ఒకే ఓటీటీలో ఉండడంతో ప్రేక్షకులు కన్య్ఫుజ్ అవుతున్నారు. ముఖ్యంగా సౌత్ ప్రేక్షకులు విజయ్ సేతుపతి మహారాజా చూద్దమాని నెట్‌ఫ్లిక్స్‌లో వెతికితే జునైద్ ఖాన్ మహారాజ్(Maharaj) ఓపెన్ అవ్వడం ఆ సినిమా మొత్తం చూశాకా కానీ మనం చూసింది వేరే మహారాజ అని ప్రేక్షకులు తెలుసుకోలేక పోవడం వంటి అనుభవలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇక ఏ మహారాజ చూసిన రెండు బాగున్నాయంటూ ప్రేక్షకులు తెలుపుతున్నారు. ముఖ్యంగా రెండు సినిమాలు సోషల్ ఇష్యూస్‌పై ఉండటంతో మూవీ లవర్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
విజయ్ సేతుపతి మహారాజ సినిమా కథ విషయానికి వస్తే.. సెలూన్ షాపు నిర్వహించే మహారాజ (విజయ్ సేతుపతి) తన కూతురు జ్యోతితో కలిసి నివసిస్తుంటాడు. ముగ్గురు దొంగలు తనపై దాడి చేసిన తన లక్ష్మిని ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే పోలీసులు ఇంతకీ లక్ష్మి ఎవరో డైలమాలో పడి కేసు నమోదు చేసేందుకు నో చెప్తారు. కానీ పోలీసులు అదేంటనే అన్వేషణ మాత్రం కొనసాగిస్తుంటారు. ఇంతకీ లక్ష్మి ఎవరు..? మహారాజ అంత జాగ్రత్త ఎందుకు తీసుకుంటాడు..? ఇంతకీ వాళ్లు లక్ష్మి ఎవరో కనిపెడతారా..? లక్ష్మిని మళ్లీ తెచ్చుకోవడమే మహారాజ లక్ష్యమా..? అనే ప్రశ్నల చుట్టూ కథ సాగుతుంది.
ఇక జునైద్ ఖాన్ మహారాజ్ కథ విషయానికి వస్తే.. భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన న్యాయ పోరాటాలలో ఒకటిగా పరిగణించబడే 1862 మహారాజ్ లిబెల్ కేసు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. 1862లో హిందూ ధర్మం పేరుతో ఒక ఆలయ బ్రాహ్మణ పూజారి యువతులను కొత్తగా పెళ్లైన వధువులను అత్యాచారం చేస్తాడు. అయితే ఈ ప్రక్రియను తప్పు అని ఎవరు చెప్పకపోగా బలత్కారం అనంతరం చరణ్ సేవ అంటూ సంబరాలు చేసుకుంటారు. భక్తి ముసుగులో చేస్తున్న ఈ అన్యాయాలను ప్రశ్నించే సంఘ సంస్కర్త కర్సందాస్ ముల్జీ (జునైద్ ఖాన్) చివరికి ఏం చేశాడు అనేది ఈ సినిమా స్టోరీ.
Also Read..