Lyca Productions | లైకా ప్రోడక్షన్స్.. కోలీవుడ్ ఇండస్ట్రీలో అతి పెద్ద ప్రొడక్షన్ హౌస్‌ల్లో ఒకటి. మురుగదాస్, విజయ్ కాంబోలో వచ్చిన కత్తి సినిమాతో ఈ ప్రోడక్షన్ పేరు తమిళనాట మారుమోగింది. ఇక ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో 2.0 సినిమాకు నిర్మాతగా భారీ డిజాస్టార్‌ను నమోదు చేసుకుంది. అయితే ఈ ప్రోడక్షన్‌కు సీక్వెల్ సినిమాలు కలిసి రావట్లేదని ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకుల అంచనా. ఎందుకంటే ఇప్పటివరకు లైకా ప్రోడక్షన్లో వచ్చిన సీక్వెల్ సినిమాలు అన్ని అట్టర్‌ఫ్లాప్‌గా నిలిచాయి. ముఖ్యంగా రోబో 2.0 తో మొదలైన ఈ పరాజయాలు చంద్రముఖి-2, పొన్నియన్ సెల్వన్, ‘భారతీయుడు-2’ వరకు అన్ని డిజాస్టార్‌గా నిలిచినవే. ఇక వీటితో పాటు ఈ ఏడాది వచ్చిన లాల్ సలామ్ కూడా డిజాస్టార్‌గా నిలిచింది. దీంతో లైకాను సీక్వెల్ సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు కాకుండా చిన్న సినిమాలు కూడా ప్రోడ్యూస్ చేస్తే అప్పుడప్పుడు ఫలితాలు కనిపిస్తాయి అని లేకపోతే మొత్తనికే ఈ బ్యానర్ మూతపడుతుందని సినీ ప్రముఖులు అనుకుంటున్నారు.
ఇదిలావుంటే మరోవైపు లైకా శంకర్‌తో భారతీయుడు 3 తెరకెక్కిస్తుంది. ఇప్పటికే ‘భారతీయుడు-2’ డిజాస్టర్‌గా మిగిలింది. దీని మీద వచ్చిన థియేట్రికల్ ఆదాయం సినిమా మీద పెట్టిన బడ్జెట్లో పదో వంతు కూడా లేకపోవడం గమనార్హం. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ‘భారతీయుడు-3’ మీద ఆశలు లేకుండా పోయాయి. దాన్నుంచి వచ్చే ఆదాయం కూడా నామమాత్రమే కావచ్చని తెలుస్తుంది.