బాలీవుడ్ నటుడు అక్షయ్ఖన్నా అసురుల గురువు శుక్రాచార్యుడి పాత్రలో నటిస్తున్న హిస్టారికల్ చిత్రం ‘మహాకాళి’. భూమిశెట్టి, శ్రియారెడ్డి, రోహిత్ సరాఫ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పూజ అపర్ణ కొల్లూరు దర్శకురాలు. ప్రశాంత్‌వర్మ క్రియేటర్‌గా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 8న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం రిలీజ్‌డేట్ అనౌన్స్‌మెంట్‌తో పాటు గ్లింప్స్‌ను విడుదల చేశారు.
ధర్మం, అధర్మం మధ్య నడిచే మహాసంగ్రామాన్ని ఆవిష్కరిస్తూ గ్లింప్స్ ఆకట్టుకుంది. శుక్రాచార్యుడి నాయకత్వంలో జరిగే ఈ యుద్ధం ప్రపంచ భవిష్యత్తునే నిర్ణయించేదిగా చూపించడం ఆసక్తిని రేకెత్తించింది. భారీ సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కిస్తున్న ‘మహాకాళి’ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుందని మేకర్స్ తెలిపారు.