నవనీత్ రైనా హీరోగా నటిస్తున్న ‘మహా సంద్రం’ చిత్రం శనివారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. కార్తికేయ.వి దర్శకత్వం వహిస్తున్నారు. శేషు రావెళ్ల, కార్తికేయ.వి నిర్మాతలు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దామోదర ప్రసాద్ క్లాప్‌నివ్వగా, ఎన్.శంకర్ కెమెరా స్విఛాన్ చేశారు.
తెలుగు, హిందీ భాషల్లో యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, త్వరలో షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు. టైగర్ శేషు, పెద్దిరాజ్, మల్లికార్జున తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కల్యాణ్సామి, సంగీతం: సుభాష్ఆనంద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కార్తికేయ.వి.