ప్రస్తుతం టిల్లు 2 (Tillu 2) సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు టాలీవుడ్ యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda). కాగా టిల్లు 2 (Tillu 2)లో ముందుగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా ఫైనల్ కాగా.. ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకున్నట్టు వార్తలు ఫిలింనగర్ సర్కిల్ లో వార్తలు రౌండప్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా దీనిపై క్లారిటీ ఇస్తూ మరో అప్డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
మడోన్నా సెబాస్టియన్ (Madonna Sebastian) ఈ చిత్రంలో హీరోయిన్గా ఫైనల్ అయిందని తాజా టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతానికి మడోన్నా ఖాతాలో పెద్దగా సినిమాలేమి లేవు. ఈ నేపథ్యంలో టిల్లు 2 సక్సెస్ అయితే మడోన్నా కెరీర్ ఊపందుకోవడం గ్యారంటీ అంటున్నారు ట్రేడ్ పండితులు.
టిల్లు 2 చిత్రానికి నరుడా డోనరుడా ఫేం మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. టిల్లు 2 టైటిల్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. కామెడీ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న టిల్లు 2 చిత్రాన్నిశ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రామ్ మిర్యాల సంగీతం అందిస్తున్నాడు.
Read Also :Sidhu Jonnalagadda | ఇంటర్వ్యూలో క్లియర్ చేస్తా.. టిల్లు 2 పుకార్లపై సిద్దు జొన్నలగడ్
Read Also :PushpaTheRise | రష్యాలో సుకుమార్, అల్లు అర్జున్ టీంకు గ్రాండ్ వెల్కమ్.. ఫొటోలు వైరల్
Read Also :RRR | ఆర్ఆర్ఆర్ ఖాతాలో మరో ఇంటర్నేషనల్ అవార్డు.. వివరాలివే