బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Oct 02, 2020 , 11:31:12

గ్యాంగ్ రేప్ ఘ‌ట‌న‌ల‌పై మండిప‌డ్డ మాధురీ దీక్షిత్

గ్యాంగ్ రేప్ ఘ‌ట‌న‌ల‌పై మండిప‌డ్డ మాధురీ దీక్షిత్

ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో జ‌రిగిన రెండు వ‌రుస గ్యాంగ్ రేప్ ఘ‌ట‌న‌లు ఉలిక్కిప‌డేలా చేశాయి.  హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనపై దేశమంతా నిరసనలు వెల్లువెత్తుతుండగానే మరో దళితపై జరిగిన సామూహిక అత్యాచారం అక్కడ మహిళా భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఇటీవలి కాలంలో వరుసగా సామూహిక అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటుండ‌డంతో అక్క‌డి ప్ర‌జ‌లు ఉలిక్కి ప‌డుతున్నారు. 

సామూహిక అత్యాచారం చేసిన నిందితుల‌ని క‌ఠినంగా శిక్షించాల‌ని దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు ఈ ఇష్యూపై త‌మ వాద‌న‌ను గట్టిగా వినిపిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ మాధురీ దీక్షిత్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా .. హ‌త్రాస్, బాల్‌రాంపూర్ సంఘట‌న‌ల గురించి విని షాక్ అయ్యాను. బాధితులు కుటుంబాల కోసం ప్రార్ధిస్తున్నాను అంతేకాదు నేరం చేసిన వారిపై క‌ఠినమైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నాను.  ఈ కేసులో నేర‌స్థుల‌కి త్వ‌ర‌గా శిక్ష ప‌డేలా చూడాలి. మ‌న స‌మాజంలో పిల్లలు, మ‌హిళ‌లు ఇలాంటి దారుణ‌మైన సంఘ‌ట‌న‌ల‌కు గురికావ‌డం దుర‌దృష్ట‌క‌రం. ఇలాంటి ఘ‌ట‌న‌లు మ‌రోసారి జ‌ర‌గ‌కుండా అధికారుల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌పాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంద‌ని మాధురీ పేర్కొంది.  


logo