కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ బయోపిక్ ‘రాకెట్రీ..ది నంబి ఎఫెక్ట్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కీ అప్డేట్ వచ్చింది.
ట్రైలర్ ను ఏప్రిల్ 1న విడుదల చేయనున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కీ రోల్ లో నటిస్తున్నాడు. మాధవన్ లీడ్ రోల్ లో డైరెక్టర్ గా, నిర్మాతగా ఈ సినిమా వస్తుండటం విశేషం. నంబి నారాయణన్ తన సర్వీసులు మొదలు పెట్టిన తొలినాళ్లలో గూఢచర్యానికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. మరి ట్రైలర్ లో మాధవన్ ఎలాంటి యాంగిల్ ను చూపిస్తాడో చూడాలి.