హైదరాబాద్ : మైత్రి మూవీస్, శ్రేయస్ మీడియాపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నెల 9వ తేదీన అంటే సుందరానికి అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మదాపూర్ శిల్పకళా వేదికలో మైత్రి మూవీస్, శ్రేయస్ మీడియా కలిసి నిర్వహించాయి. ఈ ఈవెంట్‌కు ఆ సంస్థలు ఎలాంటి అనుమతి తీసుకోలేదు. దీంతో మాదాపూర్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అంటే సుందరానికి సినిమా నిన్న విడుదలైన సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో నాని (Nani), నజ్రియా నజీమ్ (Nazriya) , అనుపమా పరమేశ్వరన్ నటించారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు నిర్మాతలుగా నవీన్ యెర్నేని, వై రవి శంకర్ వ్యవహరించారు.