మంచు విష్ణు (Manchu Vishnu) ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి సీనియర్ నటీనటుల పెన్షన్లనకు సంబంధించిన ఫైల్‌పై సంతకం చేసిన విషయం తెలిసిందే. తాజాగా మేనిఫెస్టో అమలులో భాగంగా విష్ణు కీలక ముందడుగు వేశారు. ఉమెన్ ఎంపవర్ మెంట్ గ్రీవెన్స్ సెల్ (WEGC) ఏర్పాటు చేశారు. నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి గౌరవ సలహాదారుగా పద్మశ్రీ సునీతాకృష్ణన్ (Sunitha Krishnan)ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
‘మా’ లో మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యం కల్పించడానికే ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ గ్రీవెన్స్ సెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు విష్ణు. ఈ మేరకు ట్విటర్ లో పోస్ట్ పెట్టారు విష్ణు. ఉమెన్ ఎంపవర్ మెంట్ గ్రీవెన్స్ సెల్‌కు సలహాదారుగా ఉండేందుకు ముందుకొచ్చిన సునీతాకృష్ణన్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. కమిటీ సభ్యులను త్వరలో ప్రకటించనున్నట్టు తెలిపారు. ఇది మా కుటుంబానికి రక్షణ కల్పించడంలో వేస్తున్న తొలి అడుగు. మహిళలకు మరింత శక్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నట్టు పోస్టులో పేర్కొన్నారు.
#MAA growing stronger and more accountable! More Power to Women 💪🏽 pic.twitter.com/OSkAQSEUJF
— Vishnu Manchu (@iVishnuManchu) October 22, 2021
మంచు విష్ణు తన ఎన్నికల మేనిఫెస్టోను 14 అంశాలతో ప్రకటించిన విషయం తెలిసిందే. మరి రాబోయే రోజుల్లో విష్ణు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Rakul Preet Singh | రకుల్‌ప్రీత్ సింగ్ కొత్త యోగాసనం
Ravi Teja | ఇద్దరు హీరోయిన్లతో దుబాయ్‌కు రవితేజ..!
Arha: బన్నీ కూతురిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సమంత