ఈ ఏడాది తునివు సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి.. బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar). ఈ చిత్రం ఓవర్సీస్లో అజిత్ కెరీర్లోనే ఉత్తమ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా రికార్డుల్లోకెక్కింది. ఈ స్టార్ హీరో నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ ఏకే 62 (AK 62). మేజిహ్ తిరుమెని ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ రేపు ఉదయం 10:గంటలకు భారీ అనౌన్స్ మెంట్ ఉండబోతుందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
రేపు ఎక్జయిటింగ్ డే కాబోతుంది. భారీ ప్రకటనతో మీ ముందుకు వచ్చే వరకు అదేంటో ఊహిస్తూ ఉండండి.. అంటూ ట్వీట్ చేసింది. అయితే ఈ అప్డేట్ మరేదో కాదని ఏకే 62కు సంబంధించిన అప్డేట్ అని అంతా చర్చించుకుంటున్నారు. మరి రేపు లైకా ప్రొడక్షన్స్ ఎలాంటి క్రేజీ న్యూస్ అందించబోతుందని ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. ఏకే 62 చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో అరుణ్ విజయ్, అరుళ్‌నిధి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai Bachchan) ఫీ మేల్ లీడ్ రోల్లో కనిపించనుంది. టాలెంటెడ్ యాక్టర్ అరవింద్ స్వామి కీ రోల్లో నటించనున్నట్టు తెలుస్తుండగా.. దీనిపై మేకర్స్ ఏమైనా క్లారిటీ ఇస్తారనేది చూడాలి. లైకా ప్రొడక్షన్స్ హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కించనున్న ఈ మూవీ షూటింగ్ వచ్చే నెలలో మొదలుకానుంది.
Tomorrow is going to be an exciting day 🤩✨
Keep guessing it, while we come up with a BIG ANNOUNCEMENT at 10:30AM tomorrow! 🤗#LycaProductions 🌟 pic.twitter.com/R87FefbFsV
— Lyca Productions (@LycaProductions) March 1, 2023
Ponniyin Selvan 2 | పొన్నియన్ సెల్వన్ 2 వాయిదాపై మణిరత్నం టీం క్లారిటీ
Kamal Haasan | మా టీం రోజంతా కష్టపడుతోంది.. ఇండియన్ 2పై కమల్ హాసన్
Kavya Kalyanram | సిరిసిల్లకొస్తే మా అమ్మమ్మ ఊరికి వచ్చినట్టనిపిస్తది : కావ్యా కళ్యాణ్ రామ్
Naveen Polishetty | అనుష్కతో నవీన్ పొలిశెట్టి ఫన్ చిట్‌చాట్.. టైటిల్ అనౌన్స్ మెంట్ అప్డేట్