VaaVaathiyaar | కోలీవుడ్ నటుడు కార్తీ, దర్శకుడు నలన్ కుమారస్వామి కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వా వాతియార్’. గత కొంతకాలంగా విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం, ఎట్టకేలకు సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నిజానికి ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 12న విడుదల కావాల్సి ఉంది. అయితే నిర్మాత జ్ఞానవేల్ రాజాకు సంబంధించిన పాత బాకీల విషయంలో తలెత్తిన న్యాయపరమైన చిక్కులు ఆర్థిక సమస్యల వల్ల సినిమా విడుదల నిలిచిపోయింది. తాజాగా ఆ సమస్యలన్నీ పరిష్కారం కావడంతో ‘స్టూడియో గ్రీన్’ సంస్థ పండగ రేసులోకి ఈ చిత్రాన్ని తీసుకొచ్చింది.
తమిళంలో ‘వా వాతియార్’ పేరుతో వస్తున్న ఈ చిత్రం, తెలుగులో ‘అన్నగారు వస్తారు’ అనే టైటిల్‌తో విడుదల కానుంది. అయితే, ప్రస్తుతం సంక్రాంతికి తెలుగులో పెద్ద సినిమాలు ఉండటంతో, తెలుగు వెర్షన్ విడుదల తేదీపై స్పష్టత రావాల్సి ఉంది. బహుశా తమిళంతో పాటే లేదా కొన్ని రోజుల గ్యాప్‌తో తెలుగులో విడుదలయ్యే అవకాశం ఉంది. కార్తీ సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తుండగా.. సత్యరాజ్, రాజ్‌కిరణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి అదిరిపోయే సంగీతాన్ని అందించారు. ఇది ఒక మాస్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్. ఇందులో కార్తీ పాత్ర చాలా విభిన్నంగా ఉండబోతోందని ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది.
Vaathiyaar Varaar 🔥#VaaVaathiyaar – All set for a grand release on January 14 🥳#VaaVaathiyaarPongal #VaaVaathiyaarOnJan14 pic.twitter.com/vBHpkn7qFM
— Studio Green (@StudioGreen2) January 10, 2026