‘లస్ట్ స్టోరీస్-2’ వెబ్ సిరీస్ విడుదలకు ముందే విమర్శలను ఎదుర్కొంటున్నది. టీజర్లో శృతి మించిన శృంగార సన్నివేశాలు ఉన్నాయని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సిరీస్ ఈ నెల 29 నుంచి ్రస్ట్రీమింగ్ కానుంది. ‘లస్ట్ స్టోరీస్-2’లో అగ్ర కథానాయిక తమన్నా ఓ కీలక పాత్రను పోషించింది. టీజర్లో తమన్నా పాత్ర హద్దు మీరిందనే మాటలు వినిపించాయి.
ఈ నేపథ్యంలో తమన్నా మాట్లాడుతూ ‘అందరు అనుకుంటున్నట్లుగా ఈ సిరీస్‌లో మోతాదుకు మించిన రొమాన్స్ ఏమీ ఉండదు. టైటిల్ చూసి తప్పుగా ఊహించుకోవద్దు. ఈ కథలో చక్కటి అనుబంధాల్ని చూపించాం. తల్లి, అమ్మమ్మ ప్రేమ గురించి తెలియజెప్పాం. రొమాన్స్‌తో పాటు యాక్షన్, ఎమోషన్స్ కలబోసిన కథ ఇది. విమర్శనాత్మక కోణంలో కాకుండా పాజిటివ్ మైండ్ సెట్‌తో ఈ సిరీస్ చూడండి. తప్పకుండా ఇష్టపడతారు’ అని చెప్పుకొచ్చింది.