గురువారం 01 అక్టోబర్ 2020
Cinema - Aug 07, 2020 , 15:05:10

ఈ హీరోకు లాక్ డౌన్ మంచి చేసింద‌ట‌..!

ఈ హీరోకు లాక్ డౌన్ మంచి చేసింద‌ట‌..!

లాక్ డౌన్ చాలా మందికి న‌ష్టాలు తెచ్చిపెట్టింద‌నే విష‌యం తెలిసిందే. అయితే లాక్ డౌన్ వ‌ల్ల ఓ నటుడికి మంచి జ‌రిగిందనే న్యూస్ ఇపుడు టాలీవుడ్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. అవును మీరు విన్న‌ది నిజ‌మే. ఆ న‌టుడెవ‌రో అనుకుంటున్నారా..?  తెలుగు ప్రేక్ష‌కులు మాస్ మ‌హారాజా అని పిలుచుకునే ర‌వితేజ‌. ర‌వితేజ‌కు కొన్నాళ్లుగా స‌రైన హిట్టు లేక‌పోవ‌డంతో జోష్ మిస్స‌యింది. దీంతో ఈ లాక్ డౌన్ కాలాన్ని త‌న‌ను తాను స‌రైన గాడిలో పెట్టుకునేందుకు ఉప‌యోగిస్తున్నాడ‌ట ర‌వితేజ‌‌. త‌న ప‌ర్స‌నాలిటీ షూట్ అయ్యే క‌థ‌ల‌ను అన్వేషించే ప‌నిలో ప‌డిన ఈ న‌టుడు..ప్ర‌స్తుతం యువ డైరెక్ట‌ర్ల ద‌గ్గ‌ర ప‌లు క‌థ‌ల‌ను వింటున్నాడ‌ని ఇన్ సైడ్ టాక్‌.

త్రినాథ‌రావు న‌క్కిన దర్శ‌క‌త్వంలో రానున్న సినిమాలో ప‌నిచేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలో  కామెడీ ట‌చ్ ఉన్న డిటెక్టివ్ గా క‌నిపించ‌నున్నాడు. దీంతోపాటు ర‌మేశ్ వ‌ర్మతో మాస్ ఎంట‌ర్ టైన‌ర్ చిత్రంలో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఈ రెండు ప్రాజెక్టులు ర‌వితేజ చేతిలో ఉన్నాయి. క్రాక్ విడుద‌లవ‌గానే ఈ రెండు సినిమాల‌ను ప్ర‌క‌టించ‌నున్నాడ‌ట ర‌వితేజ. మొత్తానికి లాక్ డౌన్ టైంను త‌న‌లో మరింత ఎన‌ర్జీని తెచ్చేలా వాడుకుని..స‌రికొత్త క‌థాంశాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ద‌మ‌వుతున్నాడు. మొత్తానికి ర‌వితేజకు లాక్ డౌన్ ఇలా క‌లిసొచ్చిందంటున్నారు సినీ జ‌నాలు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo