ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అర్జున్ దాస్ (Arjun Das). రీసెంట్గా వచ్చిన విక్రమ్ (Vikram)లో కీ రోల్లో మెరిసి..తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు. ఇక గోపీచంద్ హీరోగా నటించిన ఆక్సిజన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించాడు. 2017లో మలయాళ క్రైం డ్రామా అంగమలై డైరీస్ (Angamaly Diaries) (హిందీ అడాప్షన్)తో అక్కడ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.
ఈ టాలెంటెడ్ యాక్టర్‌కు సంబంధించిన వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. అర్జున్ దాస్ బాలీవుడ్ (Bollywood)అరంగేట్రం చేసేందుకు రెడీ అవుతున్నట్టు ఓ వార్త హల్ చల్ చేస్తోంది. సూర్య నటించిన హిట్ చిత్రం సూరారై పోట్రు హిందీ వెర్షన్‌ను కో ప్రొడ్యూస్ చేసిన అబండన్షియా ఎంటర్టైన్మెంట్ అర్జున్ దాస్ బాలీవుడ్ ఎంట్రీ చిత్రాన్ని నిర్మిస్తోంది. మధుమిత సుందరరామన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మధుమిత సుందరరామన్కు కూడా హిందీ డెబ్యూ చిత్రమిదే కావడం విశేషం.