Samantha | తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న భామల్లో స్టార్ నటి సమంత (Samantha) ఒకరు. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వచ్చిన సిటాడెల్ వెబ్ ప్రాజెక్ట్‌తో బిజీగా మారిన ఈ బ్యూటీ.. విడుదల తర్వాత రిలాక్సేషన్ మూడ్‌లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు మళ్లీ చాలా కాలం తర్వాత బిజీగా మారిపోయారు. వరుస ఈవెంట్స్‌లో పాల్గొంటూ అభిమానులను అలరిస్తున్నారు. అయితే, జీవితంలో ప్రతి దాన్ని చివరిదిగా భావించే దశలో తాను ఉన్నానని సామ్ తాజాగా తెలిపారు.
ఈ మేరకు ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా సామ్ మాట్లాడుతూ.. సాధారణంగా ఉండే సినిమాలను ఎన్నో అంగీకరించొచ్చన్నారు. తాను మాత్రం కచ్చితంగా ప్రేక్షకులపై ప్రభావాన్ని చూపే వాటినే ఎంపిక చేసుకుంటున్నట్లు తెలిపారు. వంద శాతం నమ్మితేనే ఆ పాత్రలను చేస్తానని, లేకపోతే చేయలేనని తెలిపారు. సవాలుగా అనిపించే పాత్రలనే ఎంపిక చేసుకుంటున్నట్లు వెల్లడించారు. రాజ్ అండ్ డీకే (Raj and DK) ఎక్కువగా సవాలుగా అనిపించే పాత్రలనే రూపొందిస్తున్నారని.. వారితో వర్క్ చేయడం తనకు ఎంతో సంతృప్తిగా ఉంటుందని సామ్ చెప్పుకొచ్చారు. గొప్ప సినిమాలో నటించాననే ఫీల్ రాకపోతే వర్క్ చేయలేనని సామ్ వివరించారు.
విజయ్ దేవరకొండతో చివరగా ఖుషి సినిమాలో నటించింది సమంత. ఈ సినిమా తర్వాత తెలుగులో మళ్లీ కొత్త ప్రాజెక్టు ప్రకటించలేదు. ప్రస్తుతం తన కొత్త వెబ్ సిరీస్ Rakt Brahmand వెబ్ సిరీస్ షూట్లో జాయిన్ అయింది.
Also Read..
“Samantha | బ్యాక్ టు వర్క్.. వెబ్ సిరీస్ షూట్లో సమంత”
“Samantha | ఆ నొప్పులు సరదాగా ఉంటాయి..! సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్”
“Keerthy Suresh | తనవల్లే ఆ అవకాశం వచ్చిందంటూ.. సమంతకు థ్యాంక్స్ చెప్పిన కీర్తి సురేశ్”