Malaikottai Valiban | మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal)కు తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ స్టార్ హీరో కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ లెవల్స్ అమాంతం పెరిగిపోతాయి. అభిమానులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అందించేందుకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మోహన్ లాల్ ఫుల్ బిజీ షెడ్యూల్లో ఉన్నాడు. మోహన్‌లాల్ నటిస్తున్న సినిమాల్లో ఒకటి మలైకోటై వాలిబన్ (Malaikottai Valiban).
లిజో జోష్ పెల్లిస్సెరీ దర్శకత్వంలో నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవలే ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ విడుదల చేసిన ప్రీ లుక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు. కండలు తిరిగిన దేహంతో గుబురు గడ్డం గెటప్‌లో ఉన్న మోహన్ లాల్.. భారీ తాడును లాగుతున్న స్టిల్ గూస్బంప్స్ తెప్పిస్తోంది. ఈ చిత్రంలో మోహల్ లాల్ కెరీర్లో ఇప్పటివరకు చేయనట్వంటి పాత్రలో కనిపించబోతున్నట్టు తాజా పోస్టర్‌తో అర్థమవుతోంది.
ఈ చిత్రంలో విద్యుత్ జమ్వాల్, రాధికా ఆప్టే, సోనాలీ కులకర్ణి, డానిష్ సేత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మ్యాక్స్ ల్యాబ్స్-సెంచురీ ఫిలిమ్స్ బ్యానర్లపై జాన్-మేరీ క్రియేటివ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం ఓ షెడ్యూల్ పూర్తి చేసుకోగా.. కొత్త షెడ్యూల్ అప్డేట్ రావాల్సి ఉంది. మోహన్ లాల్ మరోవైపు Ram: Part 1 లో నటిస్తుండగా.. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. దీంతోపాటు మరో రెండు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.
మలైకోటై వాలిబన్ ఫస్ట్ లుక్..
Presenting to you the 1st Look of #MalaikottaiVaaliban Keep cheering us on our journey to bring this movie to life.#MalaikottaiVaalibanFL@Mohanlal #MohanlalWithLJP @mrinvicible @shibu_babyjohn @mesonalee @danishsait #johnandmarycreative #maxlab @propratheesh @baraju_SuperHit pic.twitter.com/FrEonCaUFV
— BA Raju’s Team (@baraju_SuperHit) April 14, 2023
And now, the wait has a face!
Presenting to you the First Look of #MalaikottaiVaaliban! Keep cheering us on our journey to bring this movie to life.#MalaikottaiVaalibanFL@mrinvicible @shibu_babyjohn @mesonalee @danishsait #johnandmarycreative #maxlab pic.twitter.com/D8f2FM3oFP
— Mohanlal (@Mohanlal) April 14, 2023
Read Also :
Ponniyin Selvan-2 | మణిరత్నం పొన్నియన్ సెల్వన్-2 నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్
Prabhas | రాజా డీలక్స్ క్రేజీ అప్డేట్.. ప్రభాస్-రిద్దికుమార్ స్టిల్ వైరల్