గురువారం 25 ఫిబ్రవరి 2021
Cinema - Jan 19, 2021 , 09:33:12

లైగ‌ర్ పోస్ట‌ర్ విడుద‌ల ‌.. బీరాభిషేకాలు, కేక్ క‌టింగ్స్‌తో ఫ్యాన్స్ ర‌చ్చ‌

లైగ‌ర్ పోస్ట‌ర్ విడుద‌ల ‌.. బీరాభిషేకాలు, కేక్ క‌టింగ్స్‌తో ఫ్యాన్స్  ర‌చ్చ‌

అతి త‌క్కువ స‌మ‌యంలో మంచి క్రేజ్ పొందిన యువ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. చేసింది కొన్నే సినిమాలే అయిన‌ప్ప‌టికీ స్టార్ హీరో రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్‌తో క‌లిసి లైగ‌ర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ సోమవారం విడుద‌ల చేయ‌గా, ఈ పోస్ట‌ర్ అభిమానుల‌ని విశేషంగా ఆక‌ట్టుకుంది. దీంతో ఫ్యాన్స్ పోస్ట‌ర్‌తో పండుగ‌లా సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు. 

కొంద‌రు అభిమానులు పాలాభాషేకాల‌కు బ‌దులు బీరాభిషేకాలు చేశారు. ఇంకొంద‌రు కేక్‌లు క‌ట్ చేశారు. మ‌రి కొంద‌రు చేతుల‌పై లైగ‌ర్ ప‌చ్చ‌బొట్టు పొడిపించుకున్నారు. చిన్నారులు లైగ‌ర్ పోస్ట‌ర్‌కు చాక్లెట్ తినిపిస్తూ ఫొటోల‌కు ఫోజులిచ్చారు. బాణాసంచా కాల్చ‌డం, స్వీట్స్ పంచుకోవ‌డం ఇలా ఒక‌టేంటి ఎవ‌రికి న‌చ్చిన‌ట్టు వారు లైగ‌ర్ పోస్ట‌ర్ రిలీజ్ వేడుకను ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకున్నారు. 

VIDEOS

logo