టెన్త్ క్లాస్ సినిమాతో తొలిసారి లీడ్ రోల్లో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది నాగ్‌పూర్ భామ సునయన (Sunainaa). ఆ తర్వాత మరో రెండు తెలుగు చిత్రాల్లో కనిపించిన సునయన.. గతేడాది శ్రీ విష్ణుతో కలిసి రాజ రాజ చోర (Raja Raja Chora) చిత్రంలో మెరిసింది. ఈ చిత్రంతో మంచి సక్సెస్ అందుకుంది. సునయన వ్యక్తిగత జీవితంలో గుండెబద్దలయ్యే ఘటన ఒకటి జరిగిందట.
సునయన ట్విటర్లో అభిమానులతో చిట్‌చాట్ సెషన్లో పాల్గొన్నది. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు..అని ఓ అభిమాని సునయనను అడిగారు. ‘ఇప్పటికే నా హృదయం ముక్కలైంది. ఆ ఘటన నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నా.. నన్ను కోలుకోనివ్వండి..’అంటూ రిప్లై ఇచ్చి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది సునయన.
ఈ సమాధానంతో సునయన ప్రేమలో పడిందా..? ఇంతకీ ఆ వ్యక్తి ఎవరై ఉంటారు..? అసలు సునయన జీవితంలో గుండెబద్దలయ్యేంత విషయం ఏం జరిగింది..అంటూ తెగ చర్చించుకోవడం మొదలుపెట్టారు నెటిజన్లు, మూవీ లవర్స్ .
రాబోయే రోజుల్లో ఈ విషయంపై సునయన ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. కొంతకాలంగా తమిళ సినిమాలతోనే ఫుల్ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో విశాల్‌తో కలిసి లాఠీ సినిమాలో నటిస్తోంది.
Let me recover from the last heartbreak 😊 https://t.co/s8GC81iLpO
— SUNAINAA (@TheSunainaa) November 16, 2022
Read Also : Love Today Trailer | మా ఇంట్లో నేనేం చెప్తే అది.. కానీ ఈ ఇంట్లో కొంచెం కష్టం.. లవ్ టుడే ట్రైలర్
Read Also : Ram Charan | రాంచరణ్ నయా జిమ్ చూశారా..? ఆర్సీ 15 కోసం వర్కవుట్స్ వీడియో
Read Also : Dhamki | ఫస్ట్ లుక్‌తోనే ధమ్కీ ఇస్తున్న విశ్వక్ సేన్.. ట్రెండింగ్‌లో పోస్టర్