Leo Movie OTT | అన్న వస్తున్నాడు దారి ఇవ్వండి.. ‘లియో’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే.?
Leo Movie | వారసుడు సినిమా తర్వాత తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ (Thalapathy Vijay) నటించిన తాజా చిత్రం ‘లియో’ (LEO). లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాలో గౌతమ్ మీనన్, అర్జున్, సంజయ్ దత్, మన్సూర్ ఆలీ ఖాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
Leo Movie | వారసుడు సినిమా తర్వాత తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ (Thalapathy Vijay) నటించిన తాజా చిత్రం ‘లియో’ (LEO). లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాలో గౌతమ్ మీనన్, అర్జున్, సంజయ్ దత్, మన్సూర్ ఆలీ ఖాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అక్టోబర్ 19న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.550 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇక థియేటర్లో అలరించిన ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ‘లియో’ సినిమా తాజాగా ఓటీటీ లాక్ చేసుకుంది.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్లో ‘లియో’ (LEO) సినిమా నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ సోషల్ మీడియాలో తెలుపుతూ.. అన్నన్ వరార్ వళీ విడు (అన్న వస్తున్నాడు దారి ఇవ్వండి) అంటూ రాసుకొచ్చింది. ఇక ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు ఈ సినిమా ఇండియాలో నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్ కానుండగా.. గ్లోబల్ వైడ్గా మాత్రం నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు తెలిపింది.
లియోలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్దత్, యాక్షన్ కింగ్ అర్జున్ తోపాటు ప్రియా ఆనంద్, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ ఇతర కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు.
Annan vararu vali vidu💥#Leo is coming to Netflix on 24th Nov in India and 28th Nov Globally in Tamil, Telugu, Malayalam, Kannada & Hindi. https://t.co/FFH4bSjrNW
— Netflix India (@NetflixIndia) November 20, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

